• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనాడు కేసులు, అవమానాలు.. ఈనాడు పదవులతో అలంకారం.. వంటేరుపై కేసీఆర్ మార్క్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఆనాడు రాజకీయ ప్రత్యర్థులు. ఈనాడేమో ఒకే గూటి నేతలు. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులే. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌తో తలపడ్డ వంటేరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసేవారు. అదే క్రమంలో 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంటేరును ఢీకొట్టడం టీఆర్ఎస్ శ్రేణులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. అదలావుంటే ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు వంటేరును కేసీఆర్‌కు దగ్గర చేశాయి. ఆ నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది జరిగి కూడా దాదాపు 10 నెలలు అవుతోంది. అయితే ఆయనకు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేసీఆర్ మాట మీద నిలబడ్డారు.

కేసీఆర్ వర్సెస్ వంటేరు.. రెండుసార్లు గట్టి పోటీ

కేసీఆర్ వర్సెస్ వంటేరు.. రెండుసార్లు గట్టి పోటీ

కేసీఆర్ వర్సెస్ వంటేరు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఆ రెండుసార్లు కూడా వంటేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రజల చూపు గజ్వేల్ వైపు మళ్లింది. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌పై వంటేరు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంటేరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేసీఆర్ మీద పోటీ చేస్తున్నందుకు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ముందస్తు ఎన్నికల సందర్భంగా.. కేసీఆర్‌పై భగ్గుమన్న వంటేరు

ముందస్తు ఎన్నికల సందర్భంగా.. కేసీఆర్‌పై భగ్గుమన్న వంటేరు

ముందస్తు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్‌పై వంటేరు చేసిన ఆరోపణలు భగ్గుమన్నాయి. తనను ఓడించే క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. కేసీఆర్‌ను గెలిపించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కట్టలకొద్దీ డబ్బులు దాచిపెట్టారని.. ఎన్నికల అధికారులు గానీ, పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. అంతేకాదు తన ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఒకరోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర నానా హంగామా చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున పోలీసులే డబ్బులు, మందు పంచుతున్నారని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

ఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరుఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరు

కేసీఆర్ కుట్ర పన్నారు.. ఆత్మ బలిదానం చేసుకుంటానంటూ..!

కేసీఆర్ కుట్ర పన్నారు.. ఆత్మ బలిదానం చేసుకుంటానంటూ..!

రాజకీయ ప్రత్యర్థిగా తనపై కేసీఆర్ కుట్ర పన్నారని ఎన్నోసార్లు బహిరంగంగా ఆరోపించారు వంటేరు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చాక తనపై 27 కేసులు పెట్టిందని మండిపడేవారు. సందర్భం వస్తే చాలు కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం తప్ప మరో పని లేకుండా వ్యవహరించారు వంటేరు. మళ్లీ ముందస్తు ఎన్నికలు రావడంతో వేధింపులు మొదలయ్యాయని.. గజ్వేల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆత్మబలిదానం చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఓసారి ఉస్మానియా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో క్యాంపస్‌కు వెళ్లిన వంటేరును పోలీసులు చితకబాదారు. ఇష్టమొచ్చినట్లుగా ఆయనపై లాఠీఛార్జ్ చేశారు. అయితే అదంతా కూడా కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందని.. ఆ క్రమంలోనే పోలీసులు రెచ్చిపోయారని ఆరోపించారు.

మూడుసార్లు పోటీ చేసిన వంటేరు. కానీ కాలం కలిసిరాక..!

మూడుసార్లు పోటీ చేసిన వంటేరు. కానీ కాలం కలిసిరాక..!

గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో తొలిసారిగా 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తూంకుంట నర్సారెడ్డి ఆయనపై గెలుపొందారు. 2014లో కూడా టీడీపీ నుంచి వంటేరు బరిలో నిలిచారు. అయితే ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. టీఆర్ఎస్ గాలి బాగా వీయడం.. కేసీఆర్ పోటీ చేయడంతో మరోసారి ఆయనకు అపజయం తప్పలేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గెలుపొందారు. ఇక 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్‌పై పోటీకి సై అన్నారు వంటేరు. అయితే ఈసారి కూడా కేసీఆర్ విజయం సాధించారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంటేరు చేసిన హంగామా అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఆదేశాలతో తనను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.

వంటేరు మూడ్ మారింది.. కేసీఆర్‌ను తిట్టిపోయడం ఆపేసి కారులోకి జంప్

వంటేరు మూడ్ మారింది.. కేసీఆర్‌ను తిట్టిపోయడం ఆపేసి కారులోకి జంప్

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంటేరు మూడ్ మారింది. అప్పటివరకు కేసీఆర్‌ను తిట్టి పోసిన వంటేరు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. మంచి ముహుర్తం చూసుకున్నారో ఏమో గానీ.. మొత్తానికి జనవరి 18వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌పై పోటీకి దిగానని.. కేసీఆర్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. సీఎంతో పోటీ అనుకోలేదని.. ఎమ్మెల్యే కావాలన్న బలమైన సంకల్పంతోనే ఆయనపై పోటీకి దిగినట్లు చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో పనిచేస్తానని వెల్లడించారు. ఏదిఏమైనా గజ్వేల్ అభివృద్దియే తన జీవిత లక్ష్యమన్నట్లుగా అప్పటి ప్రెస్ మీట్‌లో వివరించారు.

అమ్మ అడిగిందని స్కూటర్‌పై.. కారు ఇస్తానంటూ ఆనంద్ మహీంద్రా ఆఫర్..!అమ్మ అడిగిందని స్కూటర్‌పై.. కారు ఇస్తానంటూ ఆనంద్ మహీంద్రా ఆఫర్..!

గులాబీ తీర్థం పట్టం కట్టిందిగా.. మొత్తానికి పదవి సాధించారుగా..!

గులాబీ తీర్థం పట్టం కట్టిందిగా.. మొత్తానికి పదవి సాధించారుగా..!


మొత్తానికి ఆయన కారెక్కడంతో కేసీఆర్, వంటేరు ప్రతాప్ రెడ్డి రాజకీయ వైరానికి ఎండ్ కార్డ్ పడింది. పార్టీలో చేరేటప్పుడే ఆయనకు న్యాయం చేస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని మాటిచ్చారు. అయితే ఆయన జనవరిలో గులాబీ తీర్థం పుచ్చుకుంటే.. ఇప్పుడు ఆయనకు పదవి కట్టబెట్టారు. దాదాపు 10 నెలల తర్వాత ఆయనకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డిని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే విషయం ఈ ఘట్టంతో మరోసారి రుజువైంది.

English summary
Political rivals. Today's the same party leaders. CM KCR political opponent Vanteru Pratap Reddy is well known throughout the state. In the assembly elections, he was made serious allegations against on kcr. In the same order, the 2018 pre-assembly elections were also heavily contested. After elections vanteru joined in TRS Party, now KCR given him post as telangana forest development chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X