తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 28 నుంచి రైతుబంధు నిధుల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాస్ట్రంలో డిసెంబర్ 28 నుంచి రైతులకు రైతు బంధు నిధులు అందనున్నాయి. యాసంగి పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది.

తక్కువ విస్తీర్ణం ఉన్నవారితో ప్రారంభించి సంక్రాంతి నాటికల్లా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, యాసంగి సీజన్‌కు రైతుబంధు కింద రూ. 7,600 కోట్లు సాయంగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
రైతుబంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది.
ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతు బీమాతో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా దేశ వ్యవసాయరంగ నమూనా మార్పుకు (Paradigm Shift) కు దారితీసింది. సీఎం కేసిఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి.
దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పలు మార్గాల నుండి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టిందని సీఎంవో తెలిపింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నది.కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతుబంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింద.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మరోవైపు, హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామంలో అప్పుల బాధతో.. ఆకునూరి విజయ్ కుమార్ (41) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ కుమార్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ శనివారం మృతి చెం దాడు.
మృతుడి బంధువులు ఇచ్చిన వివరాల ప్రకారం విజయ్ కుమార్
తనకున్న భూమితో పాటు కొంత కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు.
అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. గత సంవత్సరం అకాల వర్షాలతో పంట దెబ్బతినగా ఈ సంవత్సరం సరైన దిగుబడి రాక ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన గురైన విజయ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications