తెలంగాణ సెక్రటేరియట్‌కు తాళం... సోమవారం నుండి బీఆర్కే భవన్...
తెలంగాణ సెక్రటేరియట్‌కు నేటి అర్ధరాత్రి తాళం పడనుంది... నూతన కార్యాలయం నిర్మాణం నేపథ్యంలోనే సెక్రటేరియట్ విభాగాలన్ని బీఆర్కే భవన్ మారాలని గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడంతో నేటి ఆర్ధరాత్రి వరకు పూర్తిస్థాయిలో కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే అక్కడ కొన్ని విభాగాలు తమ కార్యాకలాపాలు కొనసాగిస్తుండగా పాత సెక్రటేరియట్‌లో కొన్ని మంత్రుల చాంబర్‌లు కూడ ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు పాత కార్యాలయానికి తాళం వేసి,సోమవారం నుండి బీఆర్కే కార్యాలయంలో పూర్తిస్థాయి కార్యాకలాపాలు కొనసాగనున్నాయి.

బీఆర్కే భవన్‌లోనే పూర్తి స్థాయి సెక్రటేరియట్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో నూతన అధ్య యానికి తెరతీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు నూతన సెక్రటేరియట్ కార్యాలయాన్ని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే పాతభవనాన్ని కూలగొట్టి నూతన కార్యాయాన్ని ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలాయాన్ని రూ.400 కోట్లతో నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతో జూన్ 27న సీఎం కేసిఆర్ భూమి పూజ సైతం చేశారు. త్వరిత గతిన కార్యాల యాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దీంతో మూడు నెలల్లో కార్యాలయాలను తరలించి బీఆర్కే భవన్‌కు తరలించారు. అయితే ఈ తరలింపు ప్రక్రియకు నేటితో ఫుల్‌స్టాప్ పడి పూర్తిగా తాళం వేసి నూతన కార్యాలయం నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

హుటాహుటిన తరలిన మంత్రుల పేషీలు
సచివాలయం తరలింపుతో పరిపాలన విభాగాలు మాత్రమే బీఆర్కేభవన్‌లో కొనసాగనున్నాయి. కాగా మంత్రులను కూడ ప్రజలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలు జారీ చేయడంతో రెండు రోజుల క్రితమే మంత్రుల కార్యాలయాలు సైతం ఖాళీ అయ్యాయి. ఈనేపథ్యంలోనే పలువురు మంత్రుల కార్యాలయాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో కొనసాగనున్నారు. బీఆర్కేఆర్ భవన్ లోనే వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ విధులు నిర్వహించనుండగా ఆయా విభాగాల డైరక్టరేట్స్‌లలో మంత్రుల పేషీలు కొనసాగనున్నాయి.

మంత్రుల పేషీలు, కార్యాలయాలు
ప్రధానంగా సీఎం కార్యాలయం హెచ్ఎంఆర్ఎల్, రసూల్ పురా, బేగంపేట్‌లోని మెట్రోభవన్‌లో కొనసాగనుండగా, డిప్యూటీ సీఎం మహముద్ ఆలీ డీజీపీ కార్యాలయంలో కొనసాగనుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాకలాపాలు బొగ్గులకుంటలోని ఎండోమెంట్‌కార్యాలయంలో కొనసాగనుంది. సంక్షేమ భవన్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి సత్యవతి రాథోడ్‌లు పంచాయితీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయాలు కొనసాగనున్నాయి. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మింట్‌కాంపౌండ్‌లోని విద్యుత్ కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించగా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి హాకాభవన్‌లో ,మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి, కార్మిక మంత్రి శిశుసంక్షేమ భవన్, రోడ్లు భవనాల ఖాఖ మంత్రి లక్డికాపూల్‌లోని ఈన్‌సీ కార్యాలయంలో కొనసాగనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏసి గార్డ్స్‌లోని మున్సిపల్ డైరక్టరేట్, మంత్రి హరీష్ రావు ,అరణ్యభవన్‌లో , మంత్రి గంగుల కమాలాకర్ ఖైరతాబాద్‌లోని బీసీ కమీషన్ భవన్, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కొనసాగగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బషిర్‌బాగ్ లోని ఎస్సీఈఆర్టీ భవన్‌లో , విధులు నిర్వహించనున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications