రూ. 5 లక్షల కోట్లకు చేరువలో తెలంగాణ అప్పులు: ఒక్కొక్కరిపై రుణభారం ఎంతంటే?
తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరిగాయి. కొత్తగా తీసుకున్న రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ. 4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరిగాయి. తాజాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర అప్పులు గురించిన వివరాలను వెల్లడించింది. కొత్తగా తీసుకున్న రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ. 4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ అప్పులు రూ. 4.86 లక్షల కోట్లు
ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్‌బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలను బట్జెట్ లో చూపుతుంది. ఇవి 2022-23లో రూ. 3,22,993 కోట్లుంటే 2023-24లో రూ. 35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ. 3.57,059 కోట్లకు చేరనున్నాయి. దీంతోపాటు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్ వెలుపల అదనంగా ఉంటాయి. వీటితో కలిపితే మొత్తం రూ. 4.86,302.61 కోట్లకు చేరతాయి.

తెలంగాణలో ఒక్కొక్కరిపై అప్పు ఎంతంటే?
ఇక వచ్చే ఏడాదిలో రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటుందనే అంచనాతో లెక్కిస్తే.. ఒక్కొక్కరిపై తలసరి రుణభారం రూ. 1,21,575 ఉంటుందని అనధికార అంచనా. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ(జీఎస్‌డీపీ)లో అప్పులు 25.4 శాతం కాగా, వచ్చే ఏడాదికి 23.8 శాతానికి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, 2020 నుంచి నాలుగేళ్లలో అప్పులు పెరుగుతూ వచ్చాయి. జీఎస్డీపీ విలువ పెరిగినందునే అప్పుల శాతం తగ్గినట్లు కనిపిస్తోంది తప్ప.. తీసుకున్న అప్పుల మొత్తం మాత్రం గత నాలుగేళ్లలో రూ. 2.44 లక్షల కోట్ల నుంచి రూ. 3.57 కోట్లకు పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ అప్పులు ఇవే..
రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుగా తీసుకున్న ప్రభుత్వ సంస్థలు అప్పుల వివరాలు గమనిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 66,854 కోట్లు, మిషన్ భగీరథకు రూ. 23,364.38 కోట్లు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థవి రూ.7,435.89 కోట్లు, విద్యుత్ డిస్కం లవి రూ.6,300 కోట్లు, విద్యుత్ ఆర్థికర్థి సంస్థ రూ.2,917 కోట్లు, ఇలా పలు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. వివిధ రకాల
అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలస్థ ద్వారా రుణాలను తీసుకుంటోం ది. వీటిలోకొన్ని సంస్థలుస్థ వాటికి వచ్చే ఆదాయంతోనే తిరిగి అప్పులు చెల్లిం చాల్సి ఉంటుంది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications