ఇన్నోవేషన్ తెలంగాణ: మరో ఘనత గుజరాత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి: నీతి ఆయోగ్ రిపోర్ట్
హైదరాబాద్: తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉంటూ వస్తోన్న ఈ రాష్ట్రం ఇప్పుడు తాజాగా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లోనూ టాప్ పొజీషన్‌లో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలను అధిగమించింది. ఇన్నోవేషన్ తెలంగాణ అనిపించుకుంది.
2021వ సంవత్సరానికి సంబంధించిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ (India Innovation Index)ను నీతి ఆయోగ్ ఈ ఉదయం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడుగా విభజించింది. ప్రధాన రాష్ట్రాలను ఒకే కేటగిరీలోకి చేర్చింది. ఈశాన్యా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మిగిలిన రెండు కేటగిరీల కిందికి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ర్యాంకింగులను ప్రకటించింది నీతి ఆయోగ్.

ప్రధాన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ దక్కిన పాయింట్లు 17.66. ఈ కేటగిరీలో కర్ణాటక అగ్రగామిగా నిలిచింది. తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. 18.01 పాయింట్లతో టాప్‌కు చేరింది. ఏపీ టాప్ 10లో చోటు దక్కించుకుంది. తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఏపీకి లభించిన పాయింట్లు 13.32. కర్ణాటక, తెలంగాణ తరువాత హర్యానా-16.35 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
మహారాష్ట్ర-16.06, తమిళనాడు-15.69, పంజాబ్-15.35, ఉత్తర ప్రదేశ్-14.22, కేరళ-13.67, ఏపీ-13.32, జార్ఖండ్-13.10 పాయింట్లతో టాప్ 10లో లిస్ట్ అయ్యాయి. పశ్చిమబెంగాల్-12.98, రాజస్థాన్-12.88, మధ్యప్రదేశ్-12.74, గుజరాత్-12.41, బిహార్-11.58, ఒడిశా-11.42, ఛత్తీస్‌గఢ్-10.97 పాయింట్లను దక్కించుకున్నాయి.
ఈశాన్యం, కొండ ప్రాంత రాష్ట్రాల జాబితాలో మణిపూర్ టాప్‌లో నిలిచింది. 19.37 పాయింట్లతో ఈ కేటగిరీలో అగ్రస్థానాన్ని సాధించింది. ఉత్తరాఖండ్-17.67, మేఘాలయ-16.00, అరుణాచల్ ప్రదేశ్-15.66, హిమాచల్ ప్రదేశ్-14.62, సిక్కిం-13.85, మిజోరం-13.41. త్రిపుర-11.42, అస్సాం-11.29, నాగాలాండ్-11.00 పాయింట్లతో వరుసగా 10 స్థానాల్లో నిలిచాయి.
#NITIAayog released the India Innovation Index 2021 in the presence of VC @suman_bery, CEO @paramiyer_, Member @DrVKSaraswat49 and Senior Adviser @Neeraj_NITI.
— NITI Aayog (@NITIAayog) July 21, 2022
Know more - https://t.co/ClLRMPwUrd
📑Read the full report, here - https://t.co/dICuSA5SQ2 pic.twitter.com/JmM0YGcfju
కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చండీగడ్ టాప్‌లో ఉంది. ఏకంగా 27.88 పాయింట్లను అందుకుంది. ఢిల్లీ-27.00, అండమాన్ నికోబార్-17.29, పుదుచ్చేరి-15.88, గోవా-14.93, జమ్మూకాశ్మీర్-12.83, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్-12.09, లక్షద్వీప్-7.89, లఢక్-5.91 పాయింట్లను నమోదు చేశాయి.












Click it and Unblock the Notifications