కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మొదటిసారిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కొత్తదాంట్లో తారక్ చేరడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. వారు కూడా వరుసపెట్టి థ్రెడ్స్ లో ఖాతాలు తెరుస్తున్నారు. ట్విటర్ కు పోటీగా మెటా అధినేత జుకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్ ను ఆవిష్కరించారు.
ఆండ్రాయిడ్ లో, ఐఓఎస్ ప్లాట్ ఫాంలో అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ను నాలుగు గంటల వ్యవధిలో 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకులంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులోకి వస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి కథానాయకులంతా యాక్టివ్ గా ఉంటున్నారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇన్ స్టాలోకి అడుగుపెట్టారు. పోస్ట్ చేయకుండా దాదాపు 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా థ్రెడ్స్ ను భారతదేశంలో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్నారు. సెలబ్రిటీలంతా దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు. తారక్ అకౌంట్ ఓపెన్ చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేలల్లో ఫాలోవర్స్ వచ్చారు. మిగిలిన హీరోలు కూడా ఇందులో చేరాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
తారక్ ఒక్కడే కాకుండా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి స్టార్లు కూడా థ్రెడ్స్ లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నారు.












Click it and Unblock the Notifications