• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ కేసులో కేసీఆర్ A1 ముద్దాయి..! మోదీ స‌హ‌కారంతో కేసీఆర్ పేరు మాయం..! ఉత్త‌మ్ ఘాటు విమ‌ర్శ‌లు..!

|

హైదరాబాద్: గులాబీ పార్టీ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌ధాని మోదీ తో అంత చ‌నువుగా ఉంగ‌టం వెనుక మ‌త‌ల‌బు ఏంటి అని ఆలోచించిన ఎవ‌రికీ కూడా స‌మాధానం అంత తొంద‌ర‌గా దొర‌క‌లేదు. కానీ ఆ ర‌హ‌స్యాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రెసిడెంట్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి బ‌హిర్గ‌తం చేసారు. మోదీని కేసీఆర్ త‌ర‌చూ క‌ల‌వ‌డానికి కార‌ణం తెలంగాణ ప్ర‌యోజ‌నాలు కాదని, కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలనుండి బ‌య‌ట‌ప‌డేందుకే దానికి కార‌ణం అని ఉత్త‌మ్ ఆరోపించారు. నాడు ఈఎస్ఐలో జరుగుతున్న అక్రమాలను సీబీఐ బయటపెడుతున్న సందర్భంలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. ఆ కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డ‌మే కేసీఆర్ ప్ర‌ధాన ఉద్దేశమ‌ని అందుకోసం మోదీతో స‌న్నిహితంగా ఉన్నార‌ని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హ‌యాంలో ఆయ‌న‌పై ఛార్జిషీట్ న‌మోదైంద‌ని, ఈ కుంభకోణంలో కేసీఆర్‌ ఏ-1 ముద్దాయిగా ఉన్నార‌ని ఉత్త‌మ్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పై ఫైర్ ఐన కూట‌మి నేత‌లు..! ఆ కేసులో కేసీఆర్ ముమ్మాటికీ ముద్దాయే అన్న ఉత్త‌మ్..!!

కేసీఆర్ పై ఫైర్ ఐన కూట‌మి నేత‌లు..! ఆ కేసులో కేసీఆర్ ముమ్మాటికీ ముద్దాయే అన్న ఉత్త‌మ్..!!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి పనులకు తమవద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ భవన నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కాంట్రాక్టు పద్దతిన పనులు కేటాయించకుండా నామినేషన్ పద్దతిపై ఇచ్చారని, సీబీఐ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.

కేసీఆర్ మోదీ కుమ్ముక్కు రాజకీయాలు..! ఘాటుగా విమ‌ర్శించిన ర‌మ‌ణ‌, ఉత్త‌మ్..!!

కేసీఆర్ మోదీ కుమ్ముక్కు రాజకీయాలు..! ఘాటుగా విమ‌ర్శించిన ర‌మ‌ణ‌, ఉత్త‌మ్..!!

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి ప్రజా కూటమి నేతల సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య పరీక్షల పేరుతో, రాష్ట్ర పనుల పేరు చెప్పి ఢిల్లీ వెళ్లింది సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే నని ఉత్తమ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ముందు సాగిలబడి కేసుల నుంచి రక్షణ పొందుతున్నారన్నారు. ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ కేసీఆర్ పై ఎందుకు విచారించడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ కుమ్మక్కయారు అనడానికి ఇంకా ఏ సాక్ష్యం కావాలని ఆయన ప్రశ్నించారు.

ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కేసీఆర్ 2వేల కోట్లు ఖ‌ర్చు..! ఎక్క‌డిదా డ‌బ్బు అని ప్ర‌శ్నించిన ర‌మ‌ణ‌..!!

ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కేసీఆర్ 2వేల కోట్లు ఖ‌ర్చు..! ఎక్క‌డిదా డ‌బ్బు అని ప్ర‌శ్నించిన ర‌మ‌ణ‌..!!

ఎన్నికల్లో ఆరునూరైనా గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇప్పటికే వేయికోట్లు ఖర్చు చేశారని, పోలింగ్ నాటికి మరో వేయి కోట్లు వెదజల్లుతారని టీ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ సంచలన ఆరోపణలు చేశారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తల్లిని ముండా అనే సంస్కృతి కేసీఆర్ ది అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై అడ్డగోలు విమర్శలు సరికాదని హితవు పలికారు.

ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓట‌మి ఖాయం..! స్ప‌ష్టం చేసిన కూట‌మి నేత‌లు..!!

ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓట‌మి ఖాయం..! స్ప‌ష్టం చేసిన కూట‌మి నేత‌లు..!!

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వేలాది మంది సహారా కంపెనీ ఉద్యోగుల పొట్టగొట్టారని అన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఈ కుంభకోణంలో రూ.7 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆయన అన్నారు. సీబీఐ కేసు నమోదు అయితే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నారని ఆరోపించారు. ఆ ఆధారాలన్ని తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆమె ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి కాళ్ల మీద పడిన కేసీఆర్ ఇప్పడు ఆమెపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాల ప్రమేయం లేకుండానే తన గొయ్యి తానే తవ్వుకున్నారన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
స్ట్రైక్ రేట్
AIMIM 100%
AIMIM won 1 time since 2014 elections

English summary
Telangana cm Chandrashekhar Rao and Prime Minister Modi secret was revealed by Telangana Congress President, Uttamkumar Reddy. The reason for Modi's meeting with KCR is not the Telangana benefits, KCR was accused of causing the exclusion of the illegal activities made during the Union Ministry of Labor.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more