ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్ అందుకే రాలేదా..? ఏమో ..! లోగుట్టు 'నరేంద్రుడి' కెరుక..!!
హైదరాబాద్: గులాబీ పార్టీ హైదరాబాద్ సభ అనూహ్యంగా రద్దయింది. నల్లగొండ సభ ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు రాలేకపోయారు. సీఎం లేకుండానే మంత్రులు ఈ సభను ముగించారు. సీఎం రావడం లేదంటూ తెలియడంతో ప్రజలు కూడా నెమ్మదిగా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడం, ఇంటెలీజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గి సభకు రాలేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది.

గులాబీ నేతల వాదన ఇలా ఉండగా రాజకీయ విశ్లేషకుల వాదన మరోలా ఉంది. బీజేపీ అభ్యర్థి జీ.కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాద్ సభకు గైర్హాజరు అయ్యారని అంటున్నారు. రాత్రి పది గంటల వరకు సభలు, సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్ ఇక్కడకు రాకపోవడానికి పొంతన లేని కారణం చెబుతున్నారంటున్నారు. గత వారం రోజులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవ్గాలు పర్యటించి, జనాన్ని సమీకరించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయ పర్చుకున్నారు. శ్రీనివాస్ కుమారుడు సాయి కిరణ్ సికింద్రాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications