Onion:ఉల్లి కిలో రూ.35 లే.. ఎక్కడంటే..
వన్ ఇండియా తెలుగు ఎక్స్ క్లూజివ్: కేంద్రం ప్రభుత్వం ఉల్లి ఎగుమతి సుంకాన్ని ఎత్తివేయడంతో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతోన్నాయి. మొన్నటి వరకు కిలో రూ.40 నుంచి రూ.50 ఉన్న ఉల్లి ఇప్పుడు కిలో రూ. 60 నుంచి రూ.70 పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి కొనాలంటే కన్నీరు వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బఫర్ స్టాక్ విడుదల చేసింది. అంతేకాకుండా నాఫేడ్ ద్వారా విక్రయాలు కొనసాగిస్తోంది. నాఫేడ్ ద్వారా ట్రాలీ ఆటోల్లో ఉల్లిని విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ లోని రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద నాఫేడ్ ఆధ్వర్యంలో రూ.35 లకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ విడుదల చేస్తోందని.. తెలంగాణ, ఏపీ నాఫేడ్ హెడ్ జ్యోతి పాటిల్ అన్నారు. రూ.35 ఉల్లిని బుధవారం నుంచి విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చిన ఉల్లిని కేజీ ప్యాకెట్లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు వివరించారు. ప్రజలు భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని జ్యోతి పాటిల్ వివరించారు.

అయితే ఒక్కరికి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. కొనేవారి ఫోన్ నంబర్, పేరు నమోదు చేసుకుని ఉల్లిని అమ్ముతున్నారు. కావాల్సిన వారు నాఫేడ్ మొబైల్ కౌంటర్ల వద్దకు వెల్లి పేరు, ఫోన్ నంబర్ ఇచ్చి రూ.35 చెల్లించి కిలో ఉల్లి కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ భరత్ నగర్ వద్ద నాఫేడ్ ఆధ్వర్యంలో రూ.35 లకే కిలో ఉల్లి విక్రయిస్తున్నారు. బయట కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 ఉండడంతో .. చాలా మంది ఇక్కడ కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. ఉల్లి కోసం బారులు తీరుతున్నారు.
అయితే కేవలం ఉల్లి మాత్రమే కాకుండా కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతోన్నాయి. కిలో టమాటా రూ. 50 పలుకుతుండగా.. బీరకారయ కిలో రూ.60, గోడి చిక్కుడు కిలో రూ.60, కాకరకాయ కిలో రూ.50, పచ్చిమిర్చి కిలో రూ.40, సోరకాయ పెద్దది ఒక్కటి రూ.40 పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక వెల్లుల్లి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెల్లుల్లి రూ.400 నుంచి రూ.500 పలుకుతోంది. కొద్ది రోజుల వరకు ఇవే ధరలు కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications