తెరాసతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు..మాజి మంత్రి డికే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూని చేశారని, మాజి మంత్రి డికే అరుణ విమర్శించారు .అందుకే బిజేపి లో చేరినట్టు ఆమే తెలిపారు ,ఆమే ఢిల్లిలో బిజేపి రాష్ట్ర నేతలతో కలిసి మిడాయతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పూర్తిగా క్షీణించుకుపోతుందని అన్నారు..ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల వ్యవహర శైలే కారణమని ఆరోపించారు.
టిఆర్ఎస్ తో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేశారని ఆమే తీవ్రంగా మండిపడ్డారు. ఈనేపథ్యంలో టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయంగా ఎదిగే అవకాశం ఒక్క భాజపాకే ఉందన్నారు.

కాగా మాయమాటలతో టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని విమర్షించారు. బాజపా విజయానికి కృషి చేస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications