హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్నటి వరకు చల్లచల్లని నగరం..! కానీ రాబోవు రోజుల్లో సెగలు కక్కనున్న సిటీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చల్లచల్లగా ఉండే హైదరాబాద్ నగరం పై ప్రక్రుతి పగబట్టినట్టు తెలుస్తోంది. ఎంత ఎండగా ఉన్నా చల్లని గాలులు వీచే నగరంలో ఇక నుంచి వేడి ఆవిర్లు రానున్నాయి. ఈ ఎండాకాలంలో దేశంలోనే అత్యధికంగా వడగాల్పులు వీచే డేంజర్ జోన్ లో తెలంగాణ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏప్రిల్ లోనే ఎండల మరింత పెరగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, తీవ్రత పెరిగి, వడగాల్పులు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వేడి గాలులు రానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

The coolest city till yesterday..!But in the next few days becomes hot city..!!

ఈ వేడి గాలుల ప్రభావంతో 47 నుంచి 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఆదిలాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో మరింత వేడి వుంటుందని తెలిపారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు.

తిరుమలలోని ఎండ తీవ్రతకు కాలి బూడిద అవుతున్న శేషాచలం. గత పదిహేను రోజులుగా తరచు ఇదే పరిస్థితి. ఇవాళా ధర్మగిరి వేద పాఠశాల వెనుక వైపు ఎగసి పడుతున్న మంటలు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీశాఖ సిబ్బంది. దీంతో ఎండాకాలం పూర్తిగా రాకముందే భానుడి ప్రచండరూపానికి జనాలు బెంబేలు పడుతున్నారు.

English summary
The Hyderabad Meteorological Department has warned that Telangana is the most wasted vaccine in the country during this summer. In April, when the masses are getting worse, people are worried about the situation, if the intensity increases and the sharpness increases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X