Shamshabad Air Port: ఇంకా ఎయిర్ పోర్ట్ లోనే చిరుత.. !
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరుత చిక్కలేదు. చిరుత పులిని బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు ఏర్పాటు చేశారు. అలాగే చిరుత కదలికలు గమనించేందుకు 25 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చిరుత ఎక్కడ సంచరిస్తుందో గుర్తించారు.
దానికి తగ్గట్లుగా బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకను ఎరగా ఉంచినప్పటికీ చిరుత బోనులోకి రావడం లేదు. చిరుత బోన వద్దకు వస్తుంది కానీ లోపలికి మాత్రం వెళ్లడం లేదని సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి అర్థమవుతుందని అధికారులు తెలిపారు. చిరుత ఎయిర్ పోర్ట్ లో చిత్తడిగా ఉన్న ప్రాంతల్లో సంచరిస్తోంది. చిరుతను పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం సిబ్బంది ఎయిర్ పోర్టులో ని రన్ పై చిరుత సంచరించడాన్ని చూశఆరు. రన్ వే పై సంచరిస్తున్న చిరుతను చూసిన పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది నిజంగానే చిరుత వచ్చిందా రాలేదా అనేది తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు పరిశీలించారు. చిరుత వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
దీంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్ట్ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అయితే చిరుత ఇంకా ఎయిర్ పోర్ట్ కపౌండ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శంషాబాద్ పరిసర ప్రాంతాల వారు చిరుత వస్తుందేమోనని భయపడుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications