Hyderabad: హైదరాబాదీలకు అలెర్ట్.. నీటి సమస్యపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు భూ గర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో హైదరాబాద్ లో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో నీటి సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్ కు రూ. 800 నుంచి రూ.1400 వరకు చెల్లించాల్సి వస్తుందని జనం వాపోతున్నారు. రానున్న రోజుల్లో కూడా నీటి సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అందుకే హైదరాబాదీలు నీటిని పొదుపు వాడాలని సూచిస్తున్నారు. పట్నంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడానికి ప్రధాన కారణం.. కాంక్రీట్ జంగల్.. పడిన ప్రతి నీటి బొట్టు భూమిలోకి కాకుండా.. బయటకు వెళ్లడంతో భూగర్భ జలాలు అడుగంటినట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి భవనంలో ఇంకుడు గుంతులు ఏర్పాటు చేసుకుంటే నీటి సమస్య రాదని చెబుతున్నారు. తాజాగా నీటి సమస్యపై హైకోర్టు స్పందించింది.

నీటి లభ్యత, వినియోగం బేరీజు వేసుకోవాలని సూచించింది. లేకుంటే బెంగళూరులో ఏర్పడిన నీటి సమస్యలు హైదరాబాద్ లో కూడా రావొచ్చని హెచ్చరించింది. జంట నగరాలకు సంబంధించి నీటి సమస్యపై సుభాష్ చంద్రన్ 2005లో ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను హైకోర్టు పిటిషన్ గా స్వీకరించింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడ లేవని.. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇది ప్రభుత్వ వ్యతిరేక విషయం కాదని పేర్కొంది.
ఇది ప్రజల నిత్యావసర సమస్య అని కోర్టు చెప్పింది. సో హైదరాబాదీలు నీటిని పొదుపుగా వాడుకుంటే మంచిది. లేకుంటే నీటి సమస్యలు ఎదరయ్యే అవకాశం ఉంది. ఇటు పల్లెల్లు కూడా నీటి సమస్య తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications