Coronavirus: హైదరాబాద్ పేరెంట్స్ కు అలర్ట్ - కరోనా వ్యాప్తి వేళ : ఇది తప్పనిసరి..!!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలో అయితే కొవిడ్ విలయతాండవం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనలు పేర్కొంటున్నాయి. చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ ఎత్తేసిన తర్వాత భారీగా కరోనా కేసులు పెరిగాయి. అక్కడు బీఎఫ్ 7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని తెలుస్తోంది. డ్రాగన్ దేశంలో కేసులతో పాటు కరోనా మృతి చెందేవారు కూడా భారీ పెరిగారు.
200 మృతదేహాలు
చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అంత్యక్రియల కోసం బీజింగ్ లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని తెలిసింది. బీజింగ్‌లో రెండు మరణాలు నమోదైనట్లు అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ మరణాల లెక్క అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి.

భారత్
పక్క దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. మార్గాదర్శకాలను కూడా విడుదల చేసింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్‌లోని చాలా పాఠశాలలు మాస్క్ తప్పనిసరి చేస్తూ నిబంధనను తీసుకురావాలని నిర్ణయించాయి. నియమానికి కట్టుబడి ఉండేలా చూస్తామని యాజమాన్యాలు తెలిపాయి.

పిల్లలకు మాస్క్
కేంద్రం కొత్త మార్గదర్శకాలతో మేము మాస్క్ నిబంధన ప్రాముఖ్యతపై ఆలోచించామని చెప్పాయి. మార్గదర్శకాలు ప్రకారం పిల్లలకు మాస్క్ నిబంధన చేస్తామని తెలిపాయి. తాము మాస్క నిబంధనను ఎత్తివేయలేదని కొన్ని పాఠశాలలు పేర్కొన్నాయి. ఇటు ఐటీ ఉద్యోగులు కూడా ఇప్పుడిప్పుడే ఆఫీసులకు వస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారితే, ఏమి చేయాలో చూద్దామని సీనియర్ ఐటి ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

ఎం రాజారావు
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు సూచించారు. ఓమిక్రాన్ వ్యాప్తికి ఉప వైవిధ్యాలు ఉన్నప్పటికీ, కోవిడ్ అనంతర సమస్యలు చాలా తీవ్రమైనవి అని చెప్పారు. ఆకస్మిక మరణాలలో ఎక్కువ భాగం కోవిడ్ నుంచి కోలుకున్న యువ రోగులలో గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications