Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad Metro: ప్రయాణికులకు షాక్.. 15 నిమిషాల పాటు నిలిచిపోయిన మెట్రో రైలు.. !

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కళకళలాడుతోంది. మెట్రో రైళ్లలో ప్రయాణికులు భారీగా ప్రయాణిస్తున్నారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ నుంచి అమీర్ పేటకు చాలా మంది ఇబ్బంది పడుతూ వచ్చారు. రైలు ఎక్కడానికి లోపల చోటు కూడా లేదు. అయినప్పటికీ చాలా మంది రైలు ఎక్కడానికి ప్రయత్నించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉదయం, సాయంత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వారు చెప్పారు. దీనికి తోడు మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.

తాజాగా మెట్రో రైలులో సాంకేతిక సమస్య రావడంతో రైల్వే స్టేషన్ లో రైలు 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తుండగా హైదరాబాద్ మెట్రో రైలు బేగంపేట స్టేషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైలు తలుపులు మూసుకోకపోవడంతో రైలు కదలలేదని సమాచారం. అయితే విద్యుత్‌ ఫీడర్‌ ఛానల్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

The metro train stopped at Begumpet station for 15 minutes due to a technical problem in Hyderabad Metro

సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. రైళ్ల ఆలస్యంతో స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. రైలు 15 నిమిషాల పాటు స్టేషన్ లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల సమయంలో కూడా మెట్రోలో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. గత జూన్ 5 తేదీన కూడా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్య వచ్చింది. రైళ్లు ఆగిపోవడంతో మెట్రో సిబ్బంది హుటాహుటినా ఆ మార్గంలో ఫ్రీక్వెన్సీ పెంచారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో తీసుకొచ్చారు.

ఈ మెట్రోను ఇప్పుడు మరింత విస్తరిస్తున్నారు. మెట్రో రెండో దశకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం టేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో 196ని విడుదల చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లు ఇవ్వనున్నారు. రెండో దశలో 5 మార్గాల్లో మెట్రో నిర్మాణం చేయనున్నారు. నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు మెట్రో నిర్మించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+