Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫోన్ చేయాలన్నా భయపడే పరిస్థితి, కేటీఆర్ యూటర్న్!: తెలంగాణలో చంద్రబాబు కీలకవ్యాఖ్యలు

Recommended Video

    Telangana Elections 2018 : ఇండియా లో రెండే రాజకీయ వర్గాలు : ఎన్డీయే అనుకూల, ఎన్డీయే వ్యతిరేక కూటమి

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎడిటర్స్ మీటింగ్‌కు వచ్చిన సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ చేశారని ఆరోపించారు.

    కనీసం ఫోన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ భయపెట్టి లొంగదీసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దీనిని తట్టుకోలేక తాము (తెలుగు దేశం) ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే వ్యతిరేక కూటమికి తాము పునాదులు వేశామని చెప్పారు.

     ఎవరేమన్నా.. హైదరాబాద్ కోసం కృషి చేసింది నేనే

    ఎవరేమన్నా.. హైదరాబాద్ కోసం కృషి చేసింది నేనే

    తెలంగాణ రాజధాని హైదరాబాద్, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలు అన్నదమ్ముల్లాంటివని తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి చెప్పారు. అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోవాలని చెప్పారు. హైదరాబాద్ నగరం మరింత ఎదగాలని చెప్పారు. ఎవరు ఏమి అనుకున్న తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేసింది తానే అన్నారు.

    అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ గ్రేట్

    అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ గ్రేట్

    గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ గ్రేట్ అని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు తాను అడ్డుపడ్డానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ సిటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, దేవాదులతో పాటు మిగిలిన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది నేను కాదా అని ప్రశ్నించారు.

    ప్రధాని కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించాలి

    ప్రధాని కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించాలి

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలలో దేశంలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా అని ప్రశ్నించారు. భారతదేశంలో ఇప్పుడు రెండే రాజకీయ వర్గాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఒకటి ఎన్డీయే అనుకూల, రెండు ఎన్డీయే వ్యతిరేక కూటమి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో భావసారూప్యత లేకపోయినా దేశాన్ని రక్షించడం కోసం ఆ పార్టీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.

    భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది

    భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది

    ఆ తర్వాత శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్డు షోలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ, తెరాస రెండూ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం తాము కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపామని చెప్పారు. తనను తిడుతూ కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

    తెరాస ఇల్లు కట్టిస్తుందనే నమ్మకం లేదు

    తెరాస ఇల్లు కట్టిస్తుందనే నమ్మకం లేదు

    తెరాస పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చంద్రబాబు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి దొంగాట ఆడుతున్నాయని చెప్పారు. తనను విమర్శించి పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో తెరాస ఇల్లు కట్టిస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని చెప్పారు. కేసీఆర్ ఏ ఫ్రంట్‌లో ఉంటాడో తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్, చార్మినార్‌లను తాను కట్టలేదని, అలా చెప్పలేదని అన్నారు. టీడీపీ చొరవతో హైదరాబాదులో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. గతంలో తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని కేటీఆర్ చెప్పారని, ఇప్పుడు తనపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+