Traffic: రద్దీగా మారిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి..

రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితోపాటు సాగర్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్లుల్లాపూర్ , కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంతుళ్లకు వెళ్లే ఓటర్లతో రహదారులు రద్దీగా మారాయి.

మరోవైపు ఓఆర్ఆర్ పై కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఓటు వేసేందుకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, దేవరకొండ, నాగార్జునసాగర్‌కు ఓటర్లు వెళ్తున్నారు. ఓటు వేసేందుకు వెళ్తున్న వారితో సాగర్‌ రోడ్డు రద్దీగా మారింది. పలు చోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్‌ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

The national highway of Hyderabad and Vijayawada has become congested with otter vehicles

మరోవైపు హైదరాబాద్ లో మందకొండిగా ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 12. 39 శాథం ఓటింగ్ నమోదు అయింది. హైదరాబాదీలు ప్లీజ్.. బయటకు వచ్చి ఓటేయండి.. ఓటు వేయటం కోసమే సెలవు ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్ నమోదు కాగా సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం.. మేడ్చల్ లో 2 శాతం.. గోషామహల్ లో 2 శాతం.. చార్మినార్ లో 3 శాతం.. ముషీరాబాద్ లో 4 శాతం.. రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోద్ అయింది.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదట. కార్యాలయాలకు సెలవులు ఇచ్చిన ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సహం చూపించడం లేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో కూడా తక్కువగానే పోలింగ్ నమోదు అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+