Vegetables: భారీగా పెరిగిన కూరగాయ ధరలు..

కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతోన్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లోనే కూరగాయల ధరలు 100 రేట్లు పెరిగాయి. రైతు బజార్ లోనే కూరగాయ ధరలు మండిపోతుంటే.. బయటి మార్కెట్ లో మరింత ఎక్కువ ధరలు ఉన్నాయి. ఏ రకం కూరగాయలైనా రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతుంది. పచ్చి మిర్చి ధర భారీగా పెరిగింది. కిలో పచ్చి మిర్చి రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. బిన్నీస్ కిలో రూ.80 గా ుంది.

మొన్నటి వరకు రూ.20 నుంచి రూ.25 కిలో ఉన్న టమాటా ధర డబుల్ అయింది. ఉల్లిగడ్డ ప్రస్తుతం కిలో రూ. 60 నుంచి రూ.70 పెరిగాయి. వానల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిమగుమతులు తగ్గడంతోనే ధరలు పెరుగుతోన్నాయని అంచనా వేస్తున్నారు. వినియోగదారులు కూరగాయల కొనుగోళ్లను తగ్గిస్తున్నారు. కేజీ కొనే బదులుగా అర కిలో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు కూరగాయలకు బదులుగా పప్పులు వాడుతున్నారు.

The prices of vegetables in Hyderabad have increased drastically

నగరంలోని ఆర్కేపురం, ఫలక్​నుమా, అల్వాల్, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, కూకట్​పల్లి, సరూర్​నగర్​,ఎర్రగడ్డలో రైతుబజార్లకు రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌, చేవెళ్ల, వికారాబాద్‌‌‌‌, శంకర్‌‌‌‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌ తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా హైదరాబాద్ కు కూరగాయలు వస్తుంటాయి. నగరానికి దిగుమతి అయ్యే కూరగాయల్లో 60 శాతం మనరాష్ట్రంలోని జిల్లాల నుంచే వస్తుంటాయి. 40 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి. కూరగాయలు రాక తగ్గడంతోనే ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం పెరిగిన కూరగాయల రేట్లు తాత్కాలికమేనని మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో అక్కడి నుంచి దిగుమతులు ఆగిపోయాయని వివరిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో పరిస్థితి మారుతుందంటున్నారు. మనరాష్ట్రంలో కూడా కూరగాయల సాగు బాగానే ఉందని హార్టికల్చర్ అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+