Hyderabad: గోషామహల్‌లో ఒక్కసారిగా కుంగిన భూమి.. !
హైదరాబాద్ లో ఓ చోట ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది. మీరు మాత్రం ఏం భయపడకండి.. నాల వల్ల భూమి కుంగింది అంతే. ఈ ఘటన గోషామహల్‌లో జరిగింది. చాక్నవాడిలో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిన ప్రాంతంలో ప్రతి శుక్రవారం కూరగాయల సత్తా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగానే ఈ రోజు వీధిలో రోడ్డు మధ్యలో వ్యాపారుల కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నాలాపై బరువు ఎక్కువ కావడంతో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడే కూరగాయలు అమ్ముకోవడానికి నిల్చున్న కొంత మంది అందులో పడిపోయారు. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.













Click it and Unblock the Notifications