Hyderabad: జవహర్‌నగర్ బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్..

హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు యువతి పట్ల మృగంలా ప్రవర్తించి ఘటన తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే బాధితురాలి అండగా నిలుస్తామని రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఛైర్ పర్సన్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి, కమిషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి శారద బాధితురాలి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సఖి ప్రతినిధులను ఆదేశించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. నిందితుడిపై కటిన చర్యలు తీసుకునేలా చూస్తామని ధైర్యం కల్పించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని సునీత లక్ష్మారెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.

Jawaharnagar victim

రాష్ట్రంలో మహిళలందరికీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తల్లి స్థానంలో ఉండి ఒక మహిళే ఘోరాన్ని ఆపకుండా నిందితుడికి సహకరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో పరిసర ప్రాంత ప్రజలు ప్రేక్షకపాత్ర వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. స్థానికులు తక్షణమే స్పందించి ఉంటే యువతికి రక్షణ కల్పించినవారయ్యే వారని సునీతాలక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

అయితే రాష్ట్ర మహిళా కమిషన్ కంటే ముందే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించింది. ఈ దారుణ ఘటనపై వారం రోజుల్లో డీజీపీ అంజనీకుమార్ నుంచి నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చెప్పింది. బుధవారం బాధితురాలిని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. నగరంలో శాంతి భద్రతలపై క్షీణించాయని విమర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి ఎవరు అండగా నిలవలేదన్నారు. అనంతరం స్థానిక మంత్రి మల్లారెడ్డి బాధితురాలిని పరామర్శించారు.

Jawaharnagar victim

ఆదివారం రాత్రి 8.30 గంటలకు పెద్దమారయ్య అనే వ్యక్తి తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ షాపులో పని చేస్తున్న యువతి పని ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మారయ్య యువతి బట్టలు చింపేశాడు. బైక్ పై వెళ్తున్న మరో మహిళా అతడిని వారించే ప్రయత్నం చేసింది. కానీ అతడు వినకుండా బాధితురాలి దుస్తులు లాగేశాడు. అక్కడ ఉన్న వారు వీడియో తీస్తున్నారు.. తప్పా.. ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

బాధితురాలు 15 నిమిషాలు నగ్నంగా రోడ్డుపైనే రోదిస్తూనే ఉంది. ఆ తర్వాత కొందరు వచ్చి యువతికి దుస్తువులు ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసులు పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే ఘటనా స్థలికి రాకపోవడంపై వారిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+