Drugs Case: నవదీప్‍కు నోటీసులిచ్చి విచారించండి.. హైకోర్టు..
తెలంగాణలో డ్రగ్స్ కేసు కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో తను లేనని హైకోర్టుకు వెళ్లిన నటుడు, హీరో నవదీప్ చుక్కెదురైంది. పోలీసులు రూల్స్ ఫాలో అవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. నటుడు నవదీప్ ను విచారించాలంటే ముందుగా 41(A) కింద నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ఉన్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు తెలిసిన సంగతి తెలిసిందే.
కేసుతో సంబంధం లేదని అరెస్టు చేయకుండా చర్యలు తీసుకోవాలని నవదీప్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పై విధంగా స్పందించింది. పోలీసుల తరఫున లాయర్ తన వాదించారు. గతంలోనూ డ్రగ్స్ కేసులో నవదీప్ ఉన్నారని.. దర్యాప్తు ముందు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ప్రయేయం ఉందని కోర్టుకు వివరించారు. కాగా డ్రగ్స్ కేసులో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలాజీ, రాంకిశోర్, కల్హారెడ్డి మొబైల్ డేటాన్ రాష్ట్ర నార్కోటిక్స్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరి మొబైళ్లల్లో ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితుల కస్టడీ కోరుతూ మంగళవారం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్, మురళీ, వెంకటరత్నారెడ్డిలు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14వ తేదీన ముగ్గురు నైజీరియన్లతో సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేశ్ రావు, రాంచందర్, కె.సందీప్, సుశాంత్ రెడ్డి, శ్రీకర్, కృష్ణప్సాద్ అనే వారిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కొందరు బెంగళూరులోని నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చే నిందితులు రేవ్ పార్టీలు నిర్వహించి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేవారని తెలుస్తోంది. మత్తు పదార్థాలను ఎరగావేసి మోడళ్లు, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే యువతులను రప్పించేవారని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తేవారని తెలుస్తోంది. అయితే డ్రగ్స్ కేసు ఇప్పుడు గతంలో కూడా తెరపైకి వచ్చింది. కానీ ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలేదు. తాజా కేసు కూడా అలానే నీరు గారిపోతుందని ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications