ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటన
హైదరాబాద్ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ నగర శివారులో దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.
నగర శివారులోని దుండిగల్‌లో పీఎస్ పరిధిలోని ఓ బంగారం షాపులో దోంగలు చోరీకి యత్నించారు. అయితే దొంగల సమాచారాన్ని అందుకున్న స్థానిక దుండిగల్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో అకస్మాత్తుగా ఎస్ఐ రావడంతో తప్పించుకోవడానికి దొంగలు ప్రయత్నించారు. ఈనేపథ్యంలోనే ఏకంగా ఎస్ఐపై నుండి తాము ప్రయాణిస్తున్న కారును ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఎస్ఐ అప్రమత్తం కావడంతో ప్రాణపాయం నుండి బయటపడ్డారు.

అంనతరం దోంగలను వెంబడించారు. పోలీసుల చేజింగ్‌లో కారును పట్టుకున్నారు. కాని అందులో ప్రయాణిస్తున్న దొంగల ముఠా మాత్రం పారీ పోయింది. ఇక తప్పించుకున్న దొంగలు స్థానిక దూలపల్లి అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం కారుతో పాటు, ముఠా ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విషయం ఏమిటంటే దొంగలు ప్రయాణించిన కారు కూడ దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications