• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిక్‌టాక్‌లో కొత్త పైత్యం.... కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్.... భయపెట్టిస్తున్న అమ్మాయిలు...!

|

హైదరాబాద్ : టిక్‌టాక్ పైత్యం ముదురుతోంది. సరదాల పేరిట వీడియోలు తీస్తూ పిచ్చి పీక్ స్టేజీకి చేరినట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ టిక్కుటాక్కు బురదలో సంబరపడుతున్నారు. సమయం లేదు, సందర్భం లేదు ఏది తోస్తే అదే వీడియోగా మలచి టిక్‌టాక్ యాప్‌లో తోసేస్తున్నారు. ఏక్ వీడియో నిఖాల్నా.. టిక్‌టాక్ మే అప్‌లోడ్ ఖర్నా.. ఈ రీతిలో సాగుతోంది ఆ సరదా బురద. చివరకు అది వ్యసనంలా మారి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నవారు కొందరైతే ప్రాణాలు పొగొట్టుకుంటున్నవారు మరికొందరు. ఇక తాజాగా "కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్" ఇస్తూ ఓ యువతి చేసిన టిక్కుటాక్కు వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడం చర్చానీయాంశమైంది.

ఇప్పుడదే ఫ్యాషన్.. అకౌంట్ లేదంటే అవమానమే..!

ఇప్పుడదే ఫ్యాషన్.. అకౌంట్ లేదంటే అవమానమే..!

టిక్‌టాక్ వీడియోలు తీయడం ఇప్పుడు ఫ్యాషన్. అది ఎంతలా అంటే టిక్‌టాక్ అకౌంట్ లేకుంటే అవమానం అనేంత రేంజ్‌లో అన్నమాట. అలా వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక పెట్టిన వీడియోలకు లైకులు రాకుంటే అదో రకం అవమానమట. ఇలా యువత సరదా కోసం ఆరాటపడుతూ విలువైన సమయం వృధా చేసుకోవడమే గాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కొందరు సందేశాత్మక వీడియోలు తీస్తూ సొసైటీకి ఏదో మేసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అదే క్రమంలో మరికొందరు పనీపాటా లేక పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ పరువు పొగొట్టుకుంటున్నారు.

ఇదో కొత్త పైత్యం..! కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్

ఇదో కొత్త పైత్యం..! కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్

ఇక ఇటీవల కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఓ యువతి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారుతోంది. వివిధ రకాల డాగ్స్ హావభావాలను అచ్చుగుద్దినట్లుగా అనుకరించి తీసిన ఆ వీడియో ఓ వైపు నవ్వు తెప్పిస్తున్నా.. ఈ పిచ్చేంటిరా నాయనా అనే కామెంట్లకు ఆస్కారమిస్తోంది. కొన్ని రకాల కుక్కలకు సంబంధించిన ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆమె అభినయం ఔరా అనిపించినా టిక్‌టాక్ పైత్యం పీక్ స్టేజీకి చేరిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కుక్కల హావభావాలకు సంబంధించి కొన్ని ఫోటోలను సేకరించారు సదరు యువతి. వాటిని అనుకరిస్తూ ఓ వీడియో చేశారు. అయితే ఆ ఫోటోలను పక్క ఫ్రేములో పెట్టి.. ఆమె తీసిన వీడియోను జతచేస్తూ ఎడిట్ చేయించారు. ఇక అటు కుక్కల ఫోటోలు.. ఇటు ఆమె హావభావాలు.. అలా వీడియోను తీర్చిదిద్ది టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఓ రకంగా ఆ వీడియో కోసం ఎంత కష్టపడ్డారో ఏమో గానీ.. నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించడం చర్చానీయాంశమైంది.

టైమ్ పాస్ చెత్త

టైమ్ పాస్ చెత్త

టైమ్ పాస్ కోసం వీడియోలు చేస్తూ టిక్కుటాక్కులతో రెచ్చిపోతున్న యువత ఇలాంటి పనికిమాలిన వీడియోలు తీసే బదులు సమాజానికి మేలు చేసే వీడియోలు తీయొచ్చు కదా అనే టాక్ లేకపోలేదు. అయితే టిక్కుటాక్కు సరదాబాబుల దగ్గర దానికి కూడా సమాధానముంది. సొసైటీ కోసమో.. మంచి మేసేజ్ ఇద్దామనో తీసే వీడియోలు క్లిక్ కావట. లైకులు రావట. అందుకే పనికిరాని చెత్త వీడియోలు ఎక్కువగా వస్తున్నాయనేది కొందరి వాదన.

సరదా బురద.. జీవితాలకే రిస్క్

సరదా బురద.. జీవితాలకే రిస్క్

టిక్‌టాక్ వీడియోల సరదా కాస్తా ప్రాణాల మీదకు తెస్తోంది. అంతేకాదు జీవన పోరాటంలో మరెన్నో తలనొప్పులు తెస్తోంది. అయినా కూడా వీడియోలు తీయడం.. టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడం మాత్రం ఆపలేకపోతున్నారు జనాలు. అటు ప్రాణాలతో రిస్క్ చేస్తూ.. ఇటు జీవితంలో రిమార్క్ తెచ్చుకుంటూ లేనిపోని తంటాలు పడుతున్న సందర్భాలు కొకొల్లలు. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని పోని ఫీట్లు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నారు మరికొందరు.

ఇటీవల ఈ టిక్కుటాక్కుల గోలతో ఉద్యోగాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టిక్‌టాక్ వీడియోలు ఎంత పేరు తెస్తున్నాయో, ఎన్ని లైకులు ఇస్తున్నాయో తెలియదు గానీ జీవితాలతో రిస్క్ చేస్తున్నవారి సంఖ్య పెరగడం శోచనీయం.

English summary
Tiktok bark is getting darker. Some are pretending to be taking to the mad peek stage making videos in the name of fun. There is no time, no context, but the videos uploading in tiktok app. Ek Video Nichalna .. Tiktok May Upload Karna .. This is the fun slime that goes on. The latest video of a young woman giving a "doglike expressions" is now being debated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X