కేసీఆర్‌ను ఆహ్వానించిన హీరో శర్వానంద్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సాయంత్రం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం జరిగే తన వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వానపత్రికను ఆయనకు అందజేశారు. ప్రగతి భవన్‌కు వచ్చిన శర్వానంద్‌ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవలే శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ నెల 3వ తేదీన రక్షిత రెడ్డిని పెళ్లాడాడు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా ఈ పెళ్లి జరిగింది. శర్వా-రక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య రెండు రోజుల పాటు ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు నటులు రామ్‌చరణ్, సిద్దార్థ్, అదితీరావు హైదరీ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు ఈ జంట హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలను జైపూర్ లీలా ప్యాలెస్‌లోనే నిర్వహించారు.

శర్వానంద్‌కు రామ్‌చరణ్ క్లోజ్ ఫ్రెండ్. పెళ్లి వేడుకలను పురస్కరించుకుని రామ్‌చరణ్ అతనికి హృదయపూరకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి సందర్భంగా రామ్‌చరణ్ సందడి చేశాడు. జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు శర్వానంద్-రక్షితరెడ్డికి అభినందనలు తెలియజేస్తోన్నానని అన్నాడు. ఆదితీరావు హైదరీ-సిద్ధార్థ్ జంటతో కలిసి స్టెప్స్ వేశారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో శర్వానంద్-రక్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ జరుగనుంది. దీనికి హాజరు కావాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. శర్వానంద్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలకు సైన్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. కృష్ణచైతన్య దర్శకత్వం వహించే సినిమాలో రాశీఖన్నా హీరోయిన్.












Click it and Unblock the Notifications