హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ ‘గ్రేటర్’ ప్లాన్: రంగంలోకి బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఆ జోరును త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ చూపించేందుకు కసరత్తులు చేస్తోంది. దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించిన విషయం తెలిసిందే.

గ్రేటర్ పీఠంపై బీజేపీ కన్ను..

గ్రేటర్ పీఠంపై బీజేపీ కన్ను..

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు ఇప్పటికే కసరత్తులను ప్రారంభించింది. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.

బీజేపీ విజేతకే గ్రేటర్ ఎన్నికల పగ్గాలు..

బీజేపీ విజేతకే గ్రేటర్ ఎన్నికల పగ్గాలు..

ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రంగంలోకి దించుతోంది. ఆయన రాజకీయ వ్యూహాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే ప్రారంభించింది.

గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేక టీం

గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేక టీం


బీహార్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ, రాజ్యసభ సభ్యుడైన భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలోనే బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడం గమనార్హం. బీజేపీకి ఈ ఎన్నికల్లో 72 స్థానాల్లో గెలుపొందగా, జేడీయూ 42 స్థానాలను విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భూపేందర్ యాదవ్ తోపాటు కర్ణాటక ఆరోగ్యమంత్రి, మహారాష్ట్ర బీజేపీ నేత ఆశీషెలర్, గుజరాత్ నేత ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్ణాటక అసెంబ్లీ సభ్యుడు సతీష్ రెడ్డిలు జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు కోసం పనిచేయనున్నారు.

Recommended Video

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!
టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలతో బీజేపీ నేతలు

టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలతో బీజేపీ నేతలు

బీజేపీ ప్రచార వ్యూహాలను టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ వరద సాయంలో భారీ అవినీతి జరిగిందని, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలే వందల కోట్లు పంచుకున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు రాష్ట్ర కీలక నేతలందరూ కూడా మహానగర ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నారు.

English summary
Enthused by its victory in the Dubbaka assembly by-election in Telangana last week, the Bharatiya Janata Party (BJP) is shifting gears for the Greater Hyderabad Municipal Corporation (GHMC) elections, which could be announced anytime soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X