రేవంత్ అరెస్ట్.. రాకేశ్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్తుండగా ఘటన.. కాంగ్రెస్ నేతల ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు ఘట్‌కేసర్ వద్ద అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ఆందోళనల సందర్భంగా మృతి చెందిన రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరామర్శకు వెళ్తున్న రేవంత్‌ను అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు.
రాకేశ్ అంత్యక్రియలను ఇవాళ నిర్వహిస్తారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాకేశ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాకేశ్ స్వగ్రామం దబ్బీర్‌పేట గ్రామంలోనే నిర్వహిస్తారు. రాకేశ్ మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల వరకు దబ్బీర్‌పేట గ్రామానికి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు జరుపుతారు. మరోవైపు నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు. రాకేశ్ మృతదేహం నిన్ననే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇవాళ మృతదేహాన్ని ర్యాలీగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాకేశ్ మృతదేహానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు నివాళులు అర్పించారు.

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. పథకానికి వ్యతిరేకంగా నిరసలు కొనసాగుతున్నాయి. ఉత్తరభారతానికి పరిమితం అయిన ఆందోళనలు తెలంగాణ రాష్ట్రానికి చేరాయి. నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెను విధ్వంసం సృష్టించారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరికొందరు యువకులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications