తెలంగాణ ఫలితాలపై కాంగ్రెస్ ధీమా.. ఢిల్లీ ఫ్లైటెక్కిన ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూలేని విధంగా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెరిగాయి. తెలంగాణ పీఠం కారుకా లేదంటే హస్తానికా? ఎవరిని కదిలించినా ఇదే టాపిక్. క్యాంటిన్లు, కార్యాలయాలు, పార్కులు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ చూసినా అదే చర్చ. అదలావుంటే ఫలితాలకు ఇంకా ఒక్కరోజే మిగిలిఉండటంతో ఆయా పార్టీల నేతలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఎవరికివారే స్కెచ్చులేస్తున్నారు. ఈనేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ఫ్లైటెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత చోటుచేసుకోనున్న పరిణామాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కూటమి అభ్యర్థుల విన్నింగ్ ఛాన్స్ తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ వస్తే ఏవిధంగా వ్యవహరించాలి? కూటమితో జతకట్టిన పార్టీలన్నీ కలుపుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతే ఏం చేయాలి? ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉంటే గవర్నర్ ను ఎప్పుడు కలవాలి? తదితర అంశాలు వీరి భేటీలో ముఖ్యాంశాలు కానున్నాయి. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం వెంటనే హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications