హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేశ్ నిమజ్జనోత్సవం... నేడు భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు... ర్యాలీ రూట్స్ ఇవే...

|
Google Oneindia TeluguNews

నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గణేశ్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఇప్పటికే భాగ్యనగరంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత ఏడాదితో పోల్చితే తక్కువే అయినప్పటికీ... ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనం కన్నుల పండుగ చేయనుంది. భక్తులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని పోలీసులు సూచించారు. జంట నగరాల నుంచి ట్యాంక్‌బండ్‌కి వినాయకుల తరలింపు నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం 9గం. నుంచి బుధవారం ఉదయం 8 గం.వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

Recommended Video

Ganesh Immersion Should Go Smoothly Says BJP Leader Ramachandra Rao
నిమజ్జనోత్సవ ర్యాలీ రూట్స్...

నిమజ్జనోత్సవ ర్యాలీ రూట్స్...

నార్త్‌జోన్‌ సికింద్రాబాద్‌ వైపు నుంచి... ఆర్పీ రోడ్‌, ఎంజే రోడ్‌, కర్బాల మైదాన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, నారాయణగూడ హిమాయత్‌నగర్‌ ‘వై' జంక్షన్‌ మీదుగా వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీలో కలుస్తాయి. చిలకలగూడ ఎక్స్‌రోడ్‌ నుంచి వచ్చే వాహనాలు గాంధీ దవాఖాన వైపు నుంచి వచ్చి ఆర్టీసీ ఎక్స్‌రోడ్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుతాయి.

సౌత్‌జోన్‌ వైపు నుంచి... ఫలక్‌నుమా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మీదుగా వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు... అలియాబాద్‌, నాగులచింత, చార్మినార్‌, మదీన, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి.

ర్యాలీ రూట్స్...

ర్యాలీ రూట్స్...

ఈస్ట్ జోన్... ఉప్పల్,రామాంతపూర్‌ల నుంచి వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు అంబర్‌పేట్, ఓయూ ఎన్‌సీసీ, బర్కత్‌పురా,నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్‌ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుతాయి. దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌సదన్‌, చంచల్‌గూడ మీదుగా వచ్చే వాహనాలు నల్గొండ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి. భారీ విగ్రహాలతో వచ్చే వాహనాలు మూసారాంబాగ్ నుంచి అంబర్ పేట,ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుతాయి.

వెస్ట్‌జోన్‌ వైపు నుంచి... టోలీచౌక్‌, మెహిదీపట్నంల నుంచి వచ్చే వాహనాలు అయోధ్య జంక్షన్‌, నిరంకారి భవన్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఇక్బాల్‌ మినార్‌, ఎన్టీఆర్‌మార్గ్‌ ద్వారా వెళ్లాలి. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా వెళ్లాలి.

వాహనాల మళ్లింపు...

వాహనాల మళ్లింపు...

ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలతో వెళ్లే వాహనా లకు మాత్రమే ప్రధాన రహదారులపై అనుమతి ఉంటుంది. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క బషీర్‌బాగ్‌ జంక్షన్‌లో మాత్రమే పశ్చిమం నుంచి తూర్పుకు రెండు వైపులా వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల మళ్లింపు నేపథ్యంలో వాహనదారులు రింగ్‌రోడ్డు, బేగంపేట రోడ్ల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. జేబీఎస్,ఎంజీబీఎస్‌ల నుంచి రాకపోకలు సాగించే బస్సులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.

హెల్ప్ లైన్ నంబర్స్

హెల్ప్ లైన్ నంబర్స్

నిమజ్జనానికి ఈసారి 3500 నుంచి 4వేల వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ నంబర్లు 040-27852482, 9490598985, 9010203626 అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమజ్జనం కోసం 21 మొబైల్‌ క్రేన్లు, 17 స్టాటిక్‌ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 15వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

English summary
Hyderabad city police on Monday issued traffic restrictions to be imposed in the city on the occasion of Ganesh idol immersions. The restrictions to be levied on the main immersion route are, Keshavagiri – Chandrayangutta- Falaknuma – Aliabad – Nagulchinta – Charminar – Madina building– Afzalgunj – MJ Market – Abids – Basheerbagh – Liberty – Ambedkar statue towards upper Tank Bund / NTR Marg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X