Hyderabad: సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వనాథ్ చెప్పారు. మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను దారి మళ్లిస్తామని వివరించారు. బక్రీద్ నేపథ్యంలో జూన్​ 17న ఉదయం నుంచి ప్రార్థనలు చేసేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈద్గాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లింలు వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రార్థనలకు వచ్చే వాళ్లు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గుర్తించాలన్నారు. పురానాపూల్, కమాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుండి 11:30 వరకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

Traffic restrictions will be imposed in many parts of Hyderabad on Monday

బక్రీద్ ప్రార్థనల సందర్భంగా మాసబ్ ట్యాంకు సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు వివరించారు. సోమవారం పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.

ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న మీరాలం ఈద్ సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రార్థనలకు 30 వేల మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నగరంలో ముస్లిం మేకలు, గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+