Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. రాజేందర్ నగర్ లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు బిల్డింగ్​ కు ఈ రోజు భూమి పూజ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆం

చీఫ్​జ స్టిస్​లు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయి. ఇందుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్ ​సీపీ జోయెల్ ​డేవిస్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. శంషాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆరంఘర్ ​క్రాస్ ​రోడ్ ​వద్ద జూపార్క్, బహదూర్ పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Traffic restrictions will be imposed in Rajendranagar

వాహనదారులను చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరని ప్రకటనలో పోలీసులు తెలిపారు. కాటేదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు దుర్గానగర్ ​క్రాస్​ రోడ్డులో నుంచి ఆరాంఘర్, బహదూర్ ​పురా వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ వైపు నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డులోకి వచ్చే వాహనాలు కాటేదాన్, దుర్గానగర్, ఆరాంఘర్, జూపార్క్, మెహిదీపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది. వారని ఆరాంఘర్​ జంక్షన్ వైపు పోనివ్వరు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టును నిర్మించనున్నారు.

సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. హైకోర్టు నిర్మాణం తర్వాత సిటీలో ఉన్న హైకోర్టును తరలిస్తారు. ప్రస్తుతం హైకోర్టు చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. స్థలం కూడా తక్కువగా ఉండడంతో కొత్త హైకోర్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాజేంద్ర నగర్ లో నిర్మించబోయే హైకోర్టు సిటీ వాసులకు కాస్త దూరం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+