కాంగ్రెస్ ఛార్జ్ షీట్: కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చారన్న రణదీప్ సూర్జే

తెలంగాణ వచ్చాక ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన తయారైందని మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా. గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ 24 అభియోగాలతో ఛార్జిషీట్ తయారు చేసిందన్నారు. టీఆర్ఎస్ బీజేపీలు అప్రకటిత పొత్తుతో ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటువేసినట్లే అని సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఈ నాలుగనర్ర ఏళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా కేసీఆర్ సర్కార్ చేసిందని సూర్జేవాలా ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ అవినీతి పాలనలో కూరుకుపోయిందన్నారు.

కేబినెట్ అనుమతి లేకుండానే కేసీఆర్ సర్కార్ పోలీసుల వాహనాలను కొనుగోలు చేసిందన్నారు. పోలీసు వాహనాల కొనుగోలు టెండర్లలో రూ. 3వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని సూర్జేవాల నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రతిసారి సమర్థించిన పార్టీ టీఆర్ఎస్‌ది అని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలతోనే వీరి మధ్య సఖ్యత ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హామీలిచ్చిన కేసీఆర్ మోసం చేశారు... అటు ఏపీకి హామీలిచ్చిన మోడీ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. బడా మోడీ, చోటా మోడీ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను దేశాన్ని మోసం చేశారని ఎద్దేవా చేశారు.

TRS and BJP an undeclared alliance,says Ranadeep Surjewala

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ హైజాక్ చేశారని ఫైర్ అయ్యారు రణదీప్ సూర్జేవాలా. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పైరవీలు పెరిగిపోయాయని అన్నారు. కమిషన్లు, గుత్తేదారుల కోసమే ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని ధ్వజమెత్తారు. త్వరలో కేసీఆర్‌కు ఆయన కుటుంబానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+