రాష్ట్రంలో తిరగనివ్వం.. దేశమంతా ఒకే పాలసీ ఎందుకు లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
యాసంగిలో వరి పంట వేయడంపై దుమారం రాజుకుంది. టీఆర్ఎస్- బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణపై పాలసీ చెప్పాకే బండి సంజయ్‌ను తెలంగాణలో తిరగనిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం, వేటాడతామని ఆయన అన్నారు.

అరెస్ట్ చేయాల్సిందే..
నల్గొండ రైతులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ 100 వాహనాల్లో హైదరాబాద్ నుంచి పేరు మోసిన రౌడీలతో నల్గొండ పర్యటనకు వెళ్ళాడని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. రైతుల కల్లాలు చూస్తున్నామని చెప్పి, రైతుల రక్తాన్ని బీజేపీ చూసిందన్నారు.

అలా వెళ్తారా..?
ఏ పాలసీతో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి బండి సంజయ్ వెళ్లారో సమాధానం చెప్పాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తూ.. దక్షిణ భారత దేశంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు. రైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలో యూపీలో రైతులను కార్లతో తొక్కి చంపారు. ఇప్పుడు రైతులపై రాళ్ల దాడి చేశారు.
Recommended Video

ఒకే విధానం లేదే
బీజేపీకి పాలసీ ఉంటే దేశం అంతా ఒకే విధానం ఎందుకు లేదని అడిగారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నల్గొండలో రైతులపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రైతులపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొంటారా లేదా అనే అంశంపై కేంద్రం లేఖ విడుదల చేయాలని సూచించారు. బీజేపీ తన పాలసీ చెప్పే వరకు వెంటాడుతామని.. వానాకాలం పంటను మొత్తం కొనాలని స్పష్టంచేశారు. యాసంగిలో వరి వెయ్యాలా వద్దా కేంద్రం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications