హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయా జోష్: బలమైన నేతల చేరికతో బలపడిన కాంగ్రెస్ బీసీ ఓటింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటోందా...? ఒకప్పుడు బలమైన నేతలతో గ్రాండ్‌గా కనిపించిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ తిరిగి అదే ఊపును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర వేయలేకపోయింది. అయితే ఈ సారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త చురుగ్గానే కనిపిస్తోంది. బలమైన టీఆర్ఎస్‌కు ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి గట్టి పోటీనే ఇస్తోంది. అంతేకాదు కొందరు బలమైన ఓబీసీ నేతల చేరికతో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది.

రెడ్డి కొండా చేరికతో కాంగ్రెస్‌లో కొత్త జోష్

రెడ్డి కొండా చేరికతో కాంగ్రెస్‌లో కొత్త జోష్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా... కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. బలమైన నాయకులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడమే జోష్‌కు కారణంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గులాబీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 19న కాంగ్రెస్ విడుదల చేసిన నాలుగో జాబితాలో బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేరు కనిపించడంతో ఆయన కూడా పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు బీసీల బలం కూడా చేరినట్లు సమాచారం.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బలంగా మారిన కాంగ్రెస్

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బలంగా మారిన కాంగ్రెస్


కొండా విశ్వేశ్వరరెడ్డి 2013లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈయనది సంపన్న కుటుంబం. మొదటి నుంచి పారిశ్రామిక కుటుంబంగా కొండా కుటుంబం పేరుగాంచింది. అంతేకాదు వీరి తాతగారు కొండా వెంకట ప్రతాప్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అక్కడ కాస్త ఇబ్బంది పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలతో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబర్చి అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ కోషాధికారి గూడురు నారాయణ రెడ్డి అన్నారు.2014లో టీఆర్ఎస్ తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ సీట్లు గెల్చుకుందని ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ సీట్లను కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయని ఆత్మవిశ్వాసం వ్యక్తి చేశారు రంగారెడ్డి. మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 72 సీట్లకంటే అధికంగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

 బీసీ నేతలు కృష్ణయ్య, కాసాని చేరికతో కాంగ్రెస్ వైపే బీసీలు..?

బీసీ నేతలు కృష్ణయ్య, కాసాని చేరికతో కాంగ్రెస్ వైపే బీసీలు..?

ఇక ప్రజాకూటమిలో తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. బీసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వారి ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అంచనావేస్తోంది. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన చూస్తే 53 శాతం బీసీలున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య మిర్యాలగూడా నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఆయన టిడీపీ టికెట్ పై ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కృష్ణయ్య చేరికతో తమ ఓటు శాతం మరో 10శాతం పెరిగి 80 సీట్లు వరకు గెలిచే అవకాశం ఉందని అన్నారు రంగారెడ్డి. మరోవైపు మరో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సిటీలో కాంగ్రెస్ బలపడిందనే సంకేతాలు వస్తున్నాయి. గతంలో మన ఇంటి పార్టీ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ ఉన్నారు. ఆయన 93 బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

English summary
A move by two senior political leaders to join the Congress party has suddenly put the grand old party in the driver’s seat in the forthcoming assembly elections in Telangana.Lok Sabha MP (member of Parliament) Konda Vishweshwar Reddy quit the ruling Telangana Rashtra Samithi (TRS) on Tuesday and joined Congress a day later, while prominent backward classes leader R. Krishnaiah entered the party a few days earlier, his name figuring in the Congress’s fourth list of candidates released on 19 November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X