18న మహాధర్నా.. వరి కొంటారా కొనరా, కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం
బండి సంజయ్‌పై కేసీఆర్ ఫైరయ్యారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సంజయ్ సృష్టించిన విధ్వంసంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే అని డిమాండ్ చేశారు. పొరపాటు చెప్పిన అని చెంపలు వేసుకోవాలే అని కోరారు. వేయకండి అని చెప్పాలే.. నిజాయితీ ఉంటే క్లియర్‌గా అడిగామని.. వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తదా? లేదా? కొంటరా కొనరా? దానికి సమాధానం లేదన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం..
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఏం చెబుతదని చూస్తున్నామని వివరించారు. వీళ్లు తేల్చే రకాలు కాదన్నారు. ఢిల్లీ రైతులు ధర్నా చేస్తే, ఆల్రెడి 600 మంది రైతులు చనిపోతే వారిని పట్టించుకునే దిక్కు లేదన్నారు. వాళ్ల మీద కార్లు ఎక్కించి తొక్కి సంపుతున్నారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపై కార్లు ఎక్కించి చంపుతున్నారు అని గుర్తుచేశారు.

మహా ధర్నా
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

లేఖాస్త్రం
ఏడాదికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివరాలును రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని కేంద్రానికి రేపు లేఖ రాస్తానని వివరించారు. కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితిల జిల్లా అధ్యక్షులతో కలిసి మహాధర్నా చేస్తామని వివరించారు. రైతులను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతున్నామని తెలిపారు. మధ్యాహ్నం లోపు మోడీకి, ఆహార శాఖ మంత్రికి లేఖ పంపిస్తాం అని చెప్పారు. కేంద్రం విధానాలను స్పష్టం చేయాలని కోరారు. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజన్ చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు అని స్పష్టంచేశారు.
Recommended Video

ఆగం
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం అని వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం అని తెలిపారు. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం అని పేర్కొన్నారు. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం అని తెలిపారు. యాసంగి పంటలకు రైతు బంధు డబ్బులు త్వరలోనే ఇస్తాం అన్నారు. యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో ధర్నాలో నిరసన వ్యక్తం చేస్తాం అని చెప్పారు. అప్పటికీ స్పందన లేకపోతే ప్రజలే తేల్చుతారని వివరించారు. ఈ నెల18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications