104 సీట్లలో విక్టరీ: బల్దియా ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా..
గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది, నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సీట్లు సాధిస్తామని ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. బల్దియాలో మరోసారి పాగా వేస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ విశ్వాసంతో ఉంది. అయితే బీజేపీ కూడా విజయంపై ధీమాతో ఉంది.
ఇటీవల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. 15 మంది కార్పొరేటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ గతంలో కంటే సీట్లు పెరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 104 సీట్లు సాధిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ గతంలో కన్నా సీట్లు పెరగవని చెప్పారు.
Recommended Video

మరోవైపు 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు ప్రారంభిస్తామని మంత్రి తలసాని అన్నారు. అయితే సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్లు ప్రారంభించడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. థియేటర్ యజమానులు నిర్ణయం తీసుకొని తమ వద్దకు వస్తే చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని థియేటర్లు ఇప్పుడు.. మరికొన్ని ఇంకొంత కాలం ఆగితే బాగుంటుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications