అసోం సీఎం మైకు లాగేసిన టీఆర్ఎస్ కార్యకర్త, మంత్రుల ఫైర్, ఈటల రియాక్షన్
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు హైదరాబాద్‌లో ఛేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్ వద్ద ఓ టీఆర్ఎస్ కార్యకర్త హల్ చల్ చేశాడు. భాగ్యనగరి గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గణేశ్ నిమజ్జనంలో పాల్గొనేందుకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వచ్చాడు. వేదికపై ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్‌అడ్డుకునేందుకు యత్నించాడు. వెంటనే అతడిని గణేశ్ ఉత్సవ కమిటీ, హైదరాబాద్ పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
పర్యటనలో భాగంగా ఉదయం చార్మినార్ ప్రాంతంలో గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని హిమంత బిశ్వ శర్మ దర్శించుకున్నారు. ఆ తర్వాత మొజాం జాహీ మార్కెట్ వద్దకు వచ్చారు. మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కారు. ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. వేంటనే శర్మ వెనుక నుంచి నందుబిలాల్ చొచ్చుకొని వచ్చాడు. శర్మ ముందున్న మైక్‌ను తన చేతిలోకి తీసుకున్నాడు. శర్మతో వాగ్వాదానికి దిగాడు.

అలర్ట్..
దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు పోలీసులు నందుబిలాల్‌ను అక్కడి నుంచి కిందకు దించి తరలించారు. ఆ తర్వాత శర్మ తన ప్రసంగాన్ని కొనసాగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయితే అంతకుముందు.. బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఇరువురిని అక్కడినుంచి తరలించారు.

ప్రశాంతంగా ఉండనీయరా..?
మరోవైపు ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. శర్మ వైఖరిని తప్పుపట్టారు. ప్రశాంతంగా శోభాయాత్ర జరుగుతుండగా. సీఎం కేసీఆర్‌పై అనుచితంగా మాట్లాడటం సరికాదని కామెంట్ చేశారు. ఇదీ సరికాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనీయరా అని బీజేపీ నేతలను అడిగారు. హిమంత శర్మ ఇక్కడికి రెచ్చగొట్టేందుకు వచ్చారా అని అడిగారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే తీసుకొచ్చారా అని మండిపడ్డారు. మేం అసోం వెళ్లి మాట్లాడగలం అని తెలిపారు.
ఖండిస్తున్నాం: ఈటల
మంత్రుల రియాక్షన్ ఇలా ఉంటే బీజేపీ నేత ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. అసోం సీఎం హిమంత శర్మపై దాడిని ఖండించారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ దాడి జరిగిందన్నారు. జరిగిన పరిణామాలను ప్రజలు చూస్తున్నారని వివరించారు. చిల్లర పనులు చేయడంలో కేసీఆర్‌ను మించిన వారు ఎవరూ లేరన్నారు. హిమంత శర్మపై ప్రభుత్వమే ప్లాన్డ్‌గా పని చేసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications