హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ ఛార్జీల మోత.. ఒక్క మాట కూడా చెప్పకుండా పెంపు

|
Google Oneindia TeluguNews

టీఎస్ ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రకటన జారీ చేయకుండాచార్జీలను పెంచేయడం విశేషం. దీంతో బస్సు ఎక్కిన ప్రయాణీకులు షాక్ తిన్నారు. ప్రతి 2 నుంచి 6 కిలోమీటర్లకు రూ. 5 పెంచారు. ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు, మెట్రోలో మొదటి 2 స్టేజీల వరకు ధరలను సేమ్ అలానే ఉండనుంది. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేప్టీ రూపంలో వీటిని పెంచడం విశేషం. ప్రమాదాలు, వాహనాల బీమా, విపత్తులు తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూల నిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు అధికారులు వెల్లడించారు.

ఛార్జీలు ఇలా..

ఛార్జీలు ఇలా..

ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ. 5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ మూడో స్టేజీల నుంచి రూ. 5 చొప్పున పెరిగాయి. మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డీనరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు సుమారు 4 నుంచి 5 లక్షల మంది మాత్రమే ఉంటారని, మిగతా ప్రయాణీకుల విషయంలో అదనపు భారం పడనుందని అంచనా. పల్లె వెలుగు బస్సుల్లో 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 13 చార్జీ ఉంటే.. దానిని రూ. 15కి పెంచారు. అదే బస్సులో 25 కి.మీటర్లు ప్రయాణం చేస్తే రూ. 21 ఉన్న ధరను రూ. 20గా నిర్ణయించారు. ఒక స్టేజీలో రూపాయి తగ్గించి.. మరో స్టేజీలో రెండు రూపాయల మేర పెంచారు.

భారమేనా..

భారమేనా..


సిటీ ఆర్డినరీ బస్సులో ఐదో స్టేజీ నుంచి రూ. 20గా నిర్ణయించారు. ఆరో స్టేజీలో టికెట్ తీసుకుంటే.. రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఆరో స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు ఇదే ధర వర్తించనుంది. పదో స్టేజీలో టికెట్ ధర రూ. 25 ఉంటే.. దానిని రూ. 30కి పెంచేశారు. మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల స్టేజీల సంఖ్యను తగ్తించి పెంపును వర్తింప చేసినట్లు తెలుస్తోంది.

మాట మాత్రం చెప్పకుండా..

మాట మాత్రం చెప్పకుండా..


ఛార్జీల పెంపుతో ప్రయాణికులు భారంగా ఫీల్ అవుతున్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా పెంచడం ఏంటీ అని అంటున్నారు. ఇదీ సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని చెప్పారు.

English summary
ts rtc charges rate hike in the state. ordinary, metro deluxe, metro express rate are increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X