సజ్జనార్.. నిమజ్జనోత్సవంలో సంథింగ్ స్పెషల్ : వినాయకుడి విగ్రహంతో ఇలా..!!

సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఆయనకు డిపార్ట్ మెంట్ లోనే కాదు..కామన్ పబ్లిక్ లోనూ ప్రత్యేక గుర్తింపు. ఎక్కడ ఉన్న తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రోజు హైదరాబాద్ లో గణేష్ నిజమజ్జనోత్సవం జరుగుతోంది. సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా కొనసాగతున్నారు. సాధారణ ప్రయాణీకుడిగా రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తోటి ప్రయాణీకుల సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేసారు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఎంజీబీఎస్ లో తనిఖీలు నిర్వహించారు.

బస్సులపై అశ్లీల పోస్టర్లు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఉన్నా ఆయన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి అందరి చూపునూ తన వైపు తిప్పుకొన్నారు. నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించారు. బస్సులో ఆయన బంధువులు, సన్నిహితులు తదితరులతో కలిసి.. ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వినాయుడిని నిమజ్జానికి తీసుకెళ్లారు.

TSRTC MD Sajjanar something special:Watch how this IPS officer got Lord Ganesh for immersion

ఈ వినూత్న ఆలోచన.. స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలోనూ ఆయన పలుమార్లు తన ప్రత్యేకత చాటుకున్నారు. వరంగల్ ఎస్పీగా పని చేసిన సమయంలోనూ..అదే విధంగా..దిశ హత్య కేసు ఘటనతో ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగింది. ఇక, ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో నిజమజ్జనం కోసం తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసం సాగర తీరానికి దగ్గరలోకి చేరుకున్నాడు. నాల్గవ నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం జరగనుంది.

గత ఏడాది కరనా కారణంగా నిమజ్జనం లేకపోవటంతో..ఆ సారి పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా నిమజ్జన సందడి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. పోలీసులు సైతం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొనే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం లోగానే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే నిమజ్జన నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+