టీఎస్ఆర్టీసీ సమ్మె, కోర్టు నివేదికపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం

ఆర్టీసీ కార్మికుల సమస్యపై ఏర్పడిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్‌కు అందించారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ కూడ పాల్గోన్నారు.

కార్మికుల సమస్యలపై కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులు పెట్టిన డిమాండ్లలో అమలుకు సాధ్యమయ్యో 21 డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి చర్చలు జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసును 28 వాయిదా వేసింది. దీంతో సీఎం కేసీఆర్ వాటి పరిష్కారానికి ఈడీలతో కూడిన కమిటీ వేశారు.

TSRTC Strike, C.M KCR holding a review meeting on the RTC strike

అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలు అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం. కోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా కమిటీ సభ్యులు రిపోర్టు తయారు చేశారు. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. కాగా సీఎం కేసీఆర్ విలీనంతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.. కార్మికులు మొండిపట్టుదలకు పోతే ఆర్టీసీ మనుగడ కష్టమని చెప్పారు. కాగా జీతాలకు సంబంధించి కూడ ఆర్టీసీ వద్ద డబ్బులు లేవనే విషయాన్ని స్ఫష్టం చేశారు. ఇదే వాదనలు కోర్టులో కూడ వినిపించే అవకాశాలు కనిపిస్తుంది. ఆర్టీసీ 28వ తేదీన కోర్టులో జరిగే వాదనలపై ఆర్టీసీ భవితవ్యం తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+