సుశీల కోసం ఇద్దరు భర్తల నిరీక్షణ.. పిల్లలు కూడా.. ఎక్కడ నీ జాడ..

అప్పుడప్పుడు విచిత్ర ఘటనలు జరుగుతాయి. అవీ వినడానికే కాదు చూసి కూడా నోరెళ్ల బెట్టాల్సిందే. ఇక విషయానికి వస్తే.. ఓ మహిళ కోసం ఇద్దరు భర్తలు పోరుబాటపట్టారు. అవును ఇదీ నిజమే.. జరిగింది కూడా మన భాగ్యనగరంలోనే.. విషయానికి వస్తే.. ఓ వివాహిత తన మొదటి భర్త.. పిల్లలను వదిలేసింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. అతనితోనే ఉంటానని చెబుతోంది. కానీ మొదటి భర్త.. పిల్లల కోసం అయినా తమతో రావాలని కోరుతున్నాడు. దీంతో గొడవ పీక్‌కి చేరింది. ఎటు సర్దిచెప్పలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

పంతులు భార్యకే ఎసరు..

పంతులు భార్యకే ఎసరు..

ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ టీచర్స్ కాలనీ-2 లో లంకా శశికాంత్ భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యదేవితో ఉంటున్నారు. వీరిద్దరికి 1999 ఫిబ్రవరి 2న పెద్దల సమక్షంలోనే పెళ్లి వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. వీరికి 16 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సుశీల మళ్లీ తిరిగి రాలేదు. ఇంట్లోని 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని వెళ్లింది.

వెతికిన నో యూజ్

వెతికిన నో యూజ్

భార్య కోసం తెలిసిన చోటల్లా గాలించినా ఆచూకి లభించలేదు. చివరికి ఆమె అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్‌తో వెళ్ళి పోయిందని భర్త శశికాంత్ తెలుసుకున్నాడు. ఇంట్లోని బంగారం, వెండి. డబ్బు తీసుకుని తన భార్య వరప్రసాద్‌తో పారిపోయిందని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గా సుశీలను, ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్‌ను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. సుబేదారి పోలీసు స్టేషన్‌లో ముగ్గురి మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నించారు. శశికాంత్ తన మొదటి భర్త కాదని, తన అక్క చనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానని, ఆ పిల్లలు తన పిల్లలు కాదని ట్విస్ట్ ఇచ్చింది.

భర్తేనని తెలిసింది..

భర్తేనని తెలిసింది..

అయితే పోలీసులు విచారణ చేపట్టగా శశికాంత్ ఆమె భర్తేనని, పిల్లలు సుశీల పిల్లలేనని తేలటంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు పంపారు. జైలు నుంచి విడుదల అయ్యాక ప్రియుడు సత్యవరప్రసాద్‌తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్‌లో కాపురం పెట్టి ఇద్దరూ సహజీవనం చేశారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలో సుశీల మెడలో ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్ మూడు ముళ్లు వేసి భార్యగా చేసుకున్నాడు. తర్వాత శశికాంత్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లలకు తల్లి ప్రేమ కావాలి.. తన భార్యను అప్పగించాలని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇక్కడినుంచి పరార్

ఇక్కడినుంచి పరార్


రెండో భర్త సత్యవరప్రసాద్ ఇంటి నుంచి సుశీల కనిపించడం లేదు. దీంతో రెండో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 నెలల గర్భవతి అయిన తన భార్య కనిపించటం లేదని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల ఆచూకి వెతికే పనిలో పడ్డారు. ఇటు మొదటి భర్త.. .రెండో భర్త ఫిర్యాదు చేయడంతో.. సుశీలను వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+