హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ దందాలకు అంబులెన్సులు ... భారీగా కల్లు సీసాలు చూసి అవాక్కైన పోలీసులు

|
Google Oneindia TeluguNews

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా మద్యం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమార్కులు . లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు మినహా మిగతా అన్నీ బంద్ కొనసాగుతుంది. ఇక వైన్స్ కూడా మూతపడిన నేపధ్యంలో మద్యం కోసం అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. ఒక పక్క పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తున్నా అక్రమార్కులు మాత్రం మారటం లేదు . నిత్యం ఏదో ఒకటి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు.

 స్మార్ట్ కల్లు ...బుకింగ్ పేమెంట్ అంతా ఆన్ లైన్ .. లాక్ డౌన్ ఎఫెక్ట్ స్మార్ట్ కల్లు ...బుకింగ్ పేమెంట్ అంతా ఆన్ లైన్ .. లాక్ డౌన్ ఎఫెక్ట్

 అంబులెన్స్ లో కల్లు రవాణా ..మందుబాబుల అక్రమ మార్గాలు

అంబులెన్స్ లో కల్లు రవాణా ..మందుబాబుల అక్రమ మార్గాలు


ఇక తాజాగా ఒక అంబులెన్స్ లో కల్లు రవాణా ఘటన చోటు చేసుకుంది . అనుమానంతో తనిఖీలు చేసిన పోలీసులు అంబులెన్స్ లో అక్రమ రవాణా చూసి షాక్ తిన్నారు . లాక్‌డౌన్‌తో మందుబాబులు మద్యం దొరక్క నానా తిప్పలు పడుతున్నారు. ఇక దీంతో బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా సాగుతోంది. విపరీతంగా పెంచేసిన ధరలతో లిక్కర్ వంక చూడటం మానేశారు సామాన్య , మధ్యతరగతి ప్రజలు. ఇక వీరు తమకు ప్రత్యామ్నాయంగా కల్లును ఎంచుకున్నారు . కొంతమంది కల్లు తాగి తమ లిక్కర్ బాధకు ఉపశమనం కలిగించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో కల్లు కోసం గ్రామాలకు వెళ్ళటం కష్టంగా మారింది.

 గ్రామాలకు కల్లుకు వెళ్ళలేక తిప్పలు .. అక్రమ రవాణాకు అంబులెన్సుల వినియోగం

గ్రామాలకు కల్లుకు వెళ్ళలేక తిప్పలు .. అక్రమ రవాణాకు అంబులెన్సుల వినియోగం

పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లి కల్లు తాగాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయేవారి సంఖ్య బాగా పెరగటంతో ఒక కొత్త ఎత్తుగడ వేశారు అక్రమార్కులు . అంబులెన్స్ లలో కల్లు తరలిస్తే పోలీసుల తనిఖీలు ఉండవని భావించారు. అత్యవసర సమయాల్లో రోగులను తరలించే అంబులెన్స్‌లను సైతం అక్రమ రవాణాకు సాధనాలుగా వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు లిక్కర్ బాటిల్స్ అంబులెన్స్ లో తరలిస్తూ ఇప్పటికే పట్టు బడితే ఇక తాజాగా అంబులెన్స్‌లో అయితే ఎవ్వరికీ అనుమానం రాదని భావించిన కొందరు కల్లు సీసాలను తరలించే ప్రయత్నం చేశారు.

 ఎస్సార్ నగర్ లో అంబులెన్స్ లో 40 లీటర్ల కల్లు పట్టుకున్న పోలీసులు .. కేసు నమోదు

ఎస్సార్ నగర్ లో అంబులెన్స్ లో 40 లీటర్ల కల్లు పట్టుకున్న పోలీసులు .. కేసు నమోదు

అంబులెన్స్ అయితే పోలీసులు కూడా ఆపరు అని ప్లాన్‌ చేసిన ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో కల్లు తరలిస్తూ పోలీసులకు చిక్కారు . లాక్‌డౌన్ తనిఖీలలో భాగంగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానం వచ్చి అటుగా వచ్చిన అంబులెన్స్‌ను ఆపి తనిఖీ చేశారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్ లో 40 లీటర్ల కల్లును తరలిస్తున్న ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు . ఇక వీరు చౌటుప్పల్ నుంచి అంబులెన్స్‌లో అమీర్‌పేట్ డివిజన్‌లోని బాపునగర్‌కు ఈ కల్లు తరలిస్తున్నట్టు చెప్పారు . వారి నుండి 40 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు బాలకృష్ణ , గణేష్‌ అనే ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

English summary
Illegal business continue during AP lockdown. In corona tension also Something always smuggled in the state. Liquor continues to thrive in the wake of Bandh is ongoing trend of liquor stores. two men planned taddy transport in ambulances are not stopping by the police . but un fortunately they were caught in the ambulance while they are doing illegal transportation . As part of the lockdown checks, police had set up a check post near Bulkampet under SR Nagar police station and checked the ambulance. police arrested two persons who were carrying 40 liters of taddy in an ambulance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X