హైదరాబాద్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు..? ఎవరా ఇద్దరు..?

కరోనా వైరస్ తెలంగాణను హడలెత్తిస్తోంది. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో రెండు కేసుల్లోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ రిపోర్ట్స్‌పై ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరు మహిళలే అని సమాచారం. ఇందులో ఒకరు అపోలో ఆస్పత్రిలో పనిచేసే హౌస్‌ కీపింగ్‌ వర్కర్‌ కాగా.. మరొకరు ఇటలీ నుంచి వచ్చిన టెకీగా గుర్తించారు. వీరిద్దరిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించినప్పటికీ.. కచ్చితమైన నిర్దారణ కోసం పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

 ఆ ఇద్దరిలో వైరస్ లోడ్ ఎక్కువగా..

ఆ ఇద్దరిలో వైరస్ లోడ్ ఎక్కువగా..

హైదరాబాద్‌లోని మహేంద్రాహిల్స్‌కు చెందిన ఓ టెకీకి కరోనా పాజిటివ్ బయటపడటంతో.. అతనితో సన్నిహితంగా మెలిగిన 47 మందిని గుర్తించారు. వీరందరికీ మంగళవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా... 45 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. మరో ఇద్దరి శాంపిల్స్‌లో వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటంతో నిర్దారణ కోసం పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ ఇద్దరిలో ఒకరు హౌస్ కీపింగ్ వర్కర్‌గా చేసే మహిళ,మరొకరు ఇటలీ నుంచి వచ్చిన టెకీ అని తెలుస్తోంది.

ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన

ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన

ఇటలీ నుంచి వచ్చిన ఆ టెకీ ఆస్పత్రికి రాకముందు ఎవరెవరిని కలిసింది.. ఎక్కడెక్కడికి వెళ్లింది అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొంపెల్లిలోని ఓ హాటల్లో దిగిన ఆమె.. ఆ తర్వాత మరో హోటల్‌కు వెళ్లినట్టు గుర్తించారు. సదరు టెకీ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలోని ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారంతా కరోనా అనుమానంతో ఆస్పత్రికి పరిగెత్తుతున్నారు.

Recommended Video

    Coronavirus In Hyderabad: Raheja Mindspace Tech Park Evacuated | Oneindia Telugu
     గాంధీ ఐసోలేష్ ఫుల్..

    గాంధీ ఐసోలేష్ ఫుల్..

    బుధవారం మరో 36 మంది అనుమానిత బాధితుల శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్‌ వార్డుల్లో 27 పడకలు మాత్రమే ఉండటంతో.. పెయిడ్ రూమ్స్‌ను కూడా ఐసోలేషన్‌కు వినియోగిస్తున్నారు. అయితే పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో అవి కూడా సరిపోవడం లేదు. దీంతో కరోనా అనుమానిత లక్షణాలతో వస్తున్నవారిని ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్‌ ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలిస్తున్నారు.

     అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే..

    అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే..


    హైదరాబాద్‌లో మొదటి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన టెకీ(24) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. జ్వరం తగ్గిందని,శరీరంలోని అన్ని భాగాలు సరిగానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. బాధితుడి తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ లేదని నిర్ధారణ అయింది. దీంతో బుధవారం వారిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.అనంతరం వారు మహేంద్రాహిల్స్‌లోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అప్పుడే డిశ్చార్జి చేసి ఇంటికి పంపించడంపై కాలనీవాసులు అభ్యంతరం చెప్పారు. వారిని మరికొద్దిరోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సిందని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+