Hyderabad: సంవత్సరం క్రితం పెళ్లి.. గుండెపోటుతో భర్త మృతి.. తట్టులేక భార్య ఆత్మహత్య..
మన భారత దేశంలో పెళ్లికి ఎంతో పవిత్రత ఉంది. చాలా మంది అమ్మాయిలు వివాహం తర్వాత భర్త తమ సర్వస్వంగా బతుకుతారు. చనిపోయపోయే వరకు భార్యభర్తలు ఒకరికొకకరు తోడుగా ఉంటారు. భార్య ఎడబాటు తట్టులేక భర్త.. భర్త ఎడబాటు తట్టులేక భార్య ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ భార్య తన భర్త చనిపోయిన కొద్ది రోజులుకే తాను ఆత్మ హత్య చేసుకుంది. భర్తను విడిచి ఉండలేను అంటూ తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన వాసి మనోజ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. అతను అమెరికాలోని డల్లాస్ లో స్థిరబడ్డారు. సంవత్సరం క్రితం మనోజ్ అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన సాహితీని పెళ్లి చేస్కున్నాడు. ఆ వెంటనే భార్యకు వీసా తీసుకుని ఆమెరికా తీసుకెళ్లాడు. సాహితీ మే 2న తన తల్లిదండ్రులను చూడడానికి హైదరాబాద్ కు వచ్చింది. తల్లిదండ్రులను చూసి తిరిగే వెళ్లేందుకు కూడా సిద్ధమైంది.

కానీ మే 20న అమెరికాలోని డల్లాస్ లో ఉన్న మనోజ్ గుండెపోటు వచ్చింది. అతన్ని స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మనోజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అదే రోజు మృతి చెందాడు. మనోజ్ స్నేహితులు ఈ విషయాన్ని సాహితీకి తెలియజేశారు. దీంతో సాహితీ కన్నీరుమున్నీరయింది. మే 23న మనోజ్ మృతదేహాన్ని వనస్థలిపురం తీసుకొచ్చారు. మే 24న మనోజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం సాహితీ ఇంటికి వచ్చింది.

మనోజ్ జ్ఞాపకాలు ఆమెను వెంటడాయి. భర్త మరణాన్ని తట్టుకోలేని సాహితీ గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆమె గది తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కుటుంబ సభ్యులు డోర్లు బద్ధలు కొట్టారు. గదిలోకి వెళ్లి చూడగా.. సాహితీ ఫ్యాన్ కు వెళాడుతూ కనిపించింది. విషయం తెలుసుకన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications