Hyderabad: ఉప్పల్‍లో దారుణం.. తండ్రికొడుకులను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..
హైదరాబాద్ లోని ఉప్పల్ దారుణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున తండ్రికొడుకులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నర్సింహ మూర్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కొడుకు శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు.
ముసుగులు ధరించి
తెల్లవారుజామున 5:30 సమయంలో ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. నర్సింహ మూర్తిపై కత్తులతో
పొడిచారు. తండ్రి పొడవడం చూసిన కొడుకు శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగులు అడ్డువచ్చిన శ్రీనివాస్ ను కూడా కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు తేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

పాత కక్షలు
విషయం తెలుసుకున్న పోలీసు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
పాత కక్షలతో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదంలో గతంలో కూడా ఈ విధమైన దాడి జరిగిందని బంధువులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications