ఓయూ క్యాంపస్ లేడీస్ హాస్టల్‌లో అలజడి.. అర్ధరాత్రి ఆగంతకుడు హల్‌చల్..!
హైదరాబాద్ : విద్యా కుసుమాలకు నెలవైన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆగంతకుడు లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించడం సంచలనం రేకెత్తించింది. ఆ క్రమంలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందనే వాదనలు జోరందుకున్నాయి. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ లోకి ఓ ఆగంతకుడు చొరబడటం చర్చకు దారి తీసింది. సెక్యూరిటీ లోపభూయిష్టంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున 2.30 - 3.00 గంటల ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకుడు వచ్చాడు. వసతి గృహం వెనుక వైపు నుంచి లోపలికి దూకాడు.

అదే సమయంలో ఓ విద్యార్థిని బాత్రూమ్‌కు వెళ్లారు. ఆగంతకుడు ఉన్నాడనే విషయం ఆమె కనిపెట్టలేకపోయారు. అయితే సదరు విద్యార్థిని బాత్రూమ్‌కు వెళ్లే క్రమంలో ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె బాత్రూమ్‌కు వెళ్లడంతోనే బయటి నుంచి గొళ్లెం పెట్టేశాడు. అనంతరం బాత్రూమ్ గోడపైకి ఎక్కి లోపలకు దూరాడు.
బాత్రూమ్‌లో సదరు విద్యార్థినిని కత్తితో బెదిరించాడు. అంతేకాదు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆగంతకుడి తీరుతో మొదట ఆమె భయపడ్డా.. చివరకు ధైర్యం చేసి గట్టిగా కేకలు వేశారు. దాంతో హాస్టల్‌లో ఉండే కొందరు విద్యార్థినులు అక్కడకు చేరుకున్నారు. వారందర్నీ చూసి భయపడి పరుగు లంకించుకున్నాడు ఆగంతకుడు. అలా పారిపోతూ తన వెంట సదరు విద్యార్థిని మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. అయితే ఆ ఫోన్ తీసుకెళితే తాను పోలీసులకు దొరికిపోతానని భావించాడో ఏమో గానీ హాస్టల్ వెనుకవైపు పారేసి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications