5 లక్షల కోట్ల అప్పు.. భట్టి ధ్వజం, నిలదీయాలంటోన్న ఉత్తమ్
సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో అది ఇప్పుడు నెరవేరడం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని విరుచుకుపడ్డారు. రూ. 5 లక్షల కోట్లు అప్పుల్లోకి తెలంగాణ రాష్ట్రం వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీపీఆర్‌లు లేకుండా ప్రాజెక్ట్‌లు కట్టి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని పేర్కొన్నారు. కరోనా బాధితులను పట్టించుకునే నాధుడే లేడని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఏడేళ్లలో తెలంగాణ ఆగం అయిందని అన్నారు.

ఫస్ట్ టైం లాక్‌డౌన్ పెట్టినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని మండల కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఫ్రీగా చేయాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ను బుధవారం అన్ని జిల్లాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం హామీలు.. హామీలుగానే మిగిలిపోతున్నాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యను సర్కార్ పట్టించుకోవడం లేదని కామెంట్ చేశారు. నిరుద్యోగ భృతిపై మాటే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకరోజు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఏడేళ్లలో చేసిందేమీ లేదని ఫైరయ్యారు. ప్రజలు నిలదీయాలను వారు కోరారు.












Click it and Unblock the Notifications