హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్, వంశీచంద్ రెడ్డి చర్చలు, విఫలం..

|
Google Oneindia TeluguNews

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను చేస్తోంది. రోజుకో నేత సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మనసు మారడం లేదు. లైన్‌లోకి దిగ్గీ రాజా వచ్చిన నో యూజ్.. ఇవాళ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వంశీ చంద్ రెడ్డి వేర్వేరుగా సమావేశం అయ్యారు. పార్టీని వీడొద్దని ఆ ఇద్దరూ నేతలు చెప్పారు.

 కొలిక్కిరానీ చర్చలు..

కొలిక్కిరానీ చర్చలు..


రాజగోపాల్ రెడ్డితో మొన్న భట్టి విక్రమార్క వెళ్లి చర్చలు జరిపారు. ఆ మరునాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కూడా చర్చలు జరిపారు. తర్వాత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. అయినా నో యూజ్.. ఇప్పుడు ఉత్తమ్ వంతు వచ్చింది. తమకు ఉన్న అరకొర ఎమ్మెల్యేలను కోల్పోవద్దని ఆ పార్టీ అనుకుంటుంది. అందుకోసమే విసృతంగా చర్చలు జరుపుతున్నారు.

ఉత్తమ్, వంశీచంద్ రెడ్డి

ఉత్తమ్, వంశీచంద్ రెడ్డి


ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. తర్వాత వంశీచంద్ రెడ్డి కూడా మాట్లాడారు. అయినా ఫలితం లేదు. వీరు జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. సీఎం కేసీఆర్‌పై ధర్మయుద్ధం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక ఖాయం అని వివరించారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ మార్పుకు నాంది పలుకుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు.

 బీజేపీలో చర్చ

బీజేపీలో చర్చ


రాజగోపాల్‌రెడ్డి చేరికపై బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు రాజగోపాల్ మెలిక పెట్టారు. పార్టీలో చేరేందుకు మరో వారం సమయం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అనుకుంటుంది. రాజగోపాల్ రాజీనామాపై ఎటూ తేల్చకుండా బీజేపీ నేతలను గందరగోళ పెడుతున్నారు. ఆగస్ట్ 7 వరకు సమయం ఇవ్వాలని కోరారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ అనుకుంటుంది.

English summary
uttam kumar reddy and vamsichand reddy discuss to komati reddy rajagopal reddy for continue party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X