ఉచిత ట్రీట్‌మెంట్ ఎందుకు ఇవ్వరు, కేసీఆర్‌పై ఉత్తమ్, జీవన్ ఫైర్

కరోనా కరాళ నృత్యం చేస్తోన్న సర్కార్‌కు చీమ కుట్టినట్టినట్లయిన లేదన్నారు కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివారణ చర్యలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని చెప్పారు. బెడ్లు ఉంటే ఆక్సిజన్ ఉండదు.. ఆక్సిజన్ ఉంటే బెడ్లు ఉండవని చెప్పారు. ఇక వెంటిలేటర్ల గురించి అయితే చెప్పక్కర్లేదని తెలిపారు. మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. వైరస్ నివారణ కోసం కేసీఆర్ సర్కార్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కరోనా నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయుష్మాన్‌ భారత్ దిక్కుమాలిన స్కీం అన్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కరోనాకు ఉచిత చికత్స అందిన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందించాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. నామమాత్రపు ఫీజుతో అంబులెన్స్ సర్వీసులు అందించాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవని, వాక్సినేషన్ ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అసమర్థతతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు.

uttam kumar reddy slams cm kcr

ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఫైరయ్యారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం లాలూచీ పడుతోందని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టే జీవో అమలు కావట్లేకపోవడం శోచనీయం అని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేసుల సంఖ్య తక్కువ చూపడానికే టెస్టులు చేయట్లేదని జీవన్‌రెడ్డి తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+