Hyderabad: రోడ్డుపై గుంతకు మరో ప్రాణం బలి.. చికిత్స పొందుతూ వైష్ణవి మృతి..
బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని వైష్ణవి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైష్ణవి రోడ్డుపై ఉన్న గుంత కారణంగా రోడ్డు ప్రమాదానికి గురయింది. బోయిన్ పల్లిలో వైష్ణవిని ఆమె తండ్రి స్కూటీ పై తీసుకెళ్తున్నాడు. రోడ్డుపై గుంత కారణంగా వారి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న డీసీఎం వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన వైష్ణవి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
వైష్ణవి ఎంఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు తండ్రి బైక్ పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాచుపల్లిలో కూడా ఇదే విధంగా రోడ్డు ప్రమాదం జరిగి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాచుపల్లికి చెందిన కిషోర్ కుమార్తె దీక్షిత రెండో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం కిషోర్ తన స్కూటీపై దీక్షితను పాఠశాలలో విడిచి పెట్టడానికి వెళ్లాడు. వారు స్కూటీ ముందు వెళ్తోంది.

వెనకాల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు వస్తుంది. వారి స్కూటీ రెడ్డి ల్యాబ్స్ వద్దకు రాగానే.. అక్కడ రోడ్డుపై ఉన్న గుంత కారణంగా స్కూటీ బోల్తా పడింది. పట్టుతప్పిన దీక్షిత రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న బస్ ఆమె నుంచి వెళ్లడంతో ఘటనాస్థిలిలోనే మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తె చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అతను దీక్షిత దీక్షిత అంటూ రోదించిన తీరు స్థానికంగా ఉన్నవారిని కూడా కట్టతడి పెట్టించింది. ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
వైష్ణవి తండ్రి విజయ్ కుమార్.. బోయిన్ పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్ వద్ద మెయిన్ రోడ్ ఎత్తుగా ఉండటంతో కొద్దిదూరం రోడ్డు పక్క నుంచి వెళ్లాడు. మళ్లీ మెయిన్ రోడ్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. ముందు గుంత ఉండటంతో దాన్ని తప్పించబోయాడు. ఈ క్రమంలో రోడ్డుపై స్కూటీ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. విజయ్ కుమార్ రోడ్డు పక్కకు, అతని కుమార్తె రోడ్డుపై పడిపోయారు. విజయ్ కుమార్ స్కూటీ పైకి లేపుతుండగా.. సుచిత్ర సర్కిల్ నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వైష్ణవిని ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టి వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా డీసీఎంను గుర్తించే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications