హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకట్రామిరెడ్డికి ఆర్థికశాఖ.? వైద్యారోగ్యశాఖకే హరీశ్ రావు పరిమితం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులు ఊహాగానాల నేపథ్యంలో.. పోర్టుపోలియో రూమర్లు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటివరకు హరీశ్ రావు వద్ద ఉన్న ఆర్థికశాఖ మారనుందని తెలుస్తోంది. కీలకమైన శాఖను మాజీ ఐఏఎస్ అధికారికి కట్టబెడతారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది.

కొత్తగా ఎమ్మెల్సీ అయిన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. సీఎంతో సన్నిహితంగా ఉన్న ఆయనకు ఛాన్స్‌ ఇస్తే కేబినెట్‌లో ఒక బెర్త్‌ ఖాళీ చేయాల్సి వస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డిని కేబినెట్ నుంచి డ్రాప్‌ చేయొచ్చనే ఉహాగానాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను నడిపించలేకపోతున్నారనే విమర్శ ఆయనపై ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి గెలిచి కేబినెట్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు పట్నం మహేందర్‌రెడ్డి. కానీ వెంకట్రామిరెడ్డికి బెర్త్ ఖాయం అనే వార్తలు గుప్పుమన్నాయి.

venkatrami reddy will new finance minister

అంతేకాదు వెంకట్రామిరెడ్డికి కీలకమైన ఆర్థికశాఖను కట్టబెడతారని తెలుస్తోంది. అంటే వచ్చే ఫిబ్రవరిలో తెలంగాణ పద్దును ఆయనే ప్రవేశపెడతారు. బ్యూరోక్రాట్ అయిన ఆయనకు.. కీలక శాఖను అప్పగిస్తారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్టు సమాచారం. ఇటు హరీశ్ రావును కేవలం వైద్యారోగ్యశాఖకే పరిమితం చేస్తారు. ఆర్థికశాఖను అతని నుంచి లాక్కుంటారు. గతేడాది కూడా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

దీంతో ఆర్థికశాఖ ఇచ్చినా.. పేరుకు మాత్రమే హరీశ్ రావు కొనసాగారు. ఒకసారి కేసీఆర్ ప్రవేశపెట్టగా.. ఈ సారి మరొకరికి అవకాశం లభించనుంది. కానీ హరీశ్ రావు ప్రయారిటీ మాత్రం తగ్గుతుంది. వెంకట్రామి రెడ్డి.. వరి విత్తనాలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ గొడవ క్రమంగా సద్దుమణిగింది. తర్వాత మెల్లగా జనం అంతా మరచిపోయారు. ఇటు ఓ సభలో కేసీఆర్ పాదాలకు వెంకట్రామిరెడ్డి నమస్కారం చేశారు. ఆ విధేయత అతనికి పదవీ వచ్చేట్టు చేస్తోంది. అదీ కూడా కీలకమైన ఆర్థికశాఖ దక్కనుండటం ప్లస్ పాయింట్ అవనుంది.

English summary
venkatrami reddy will new telangana finance minister sources said. telangana cabinet will be expansion in soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X